Naga Chaitanya: సినీ సెలబ్రిటీల్లో ఎంతోమంది లవ్ మ్యారేజేస్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. చాలావరకు హీరోహీరోయిన్లు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టకుండా డైరెక్ట్ పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అప్పుడు కొన్నాళ్ల పాటు వారి పెళ్లి గురించే ప్రేక్షకులు చర్చించుకుంటారు. అలా ఇటీవల టాలీవుడ్‌లో జరిగిన సినీ సెలబ్రిటీల పెళ్లిలో చాలామంది ప్రేక్షకులు మాట్లాడుకున్నది నాగచైతన్య, శోభితా పెళ్లి గురించే. పెళ్లి తర్వాత నాగచైతన్య నటించిన ‘తండేల్’ ముందుగా థియేటర్లలో సందడి చేయనుండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో శోభితాతో తన రిలేషన్ గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు పంచుకుంటున్నాడు చైతూ.
పర్సనల్ లైఫ్‌పై ప్రశ్నలు
ముందుగా హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య.. తనకు విడాకులు ఇచ్చాడు. విడాకులు అయిన రెండేళ్ల తర్వాత మరొక హీరోయిన్ అయిన శోభితాను పెళ్లి చేసుకున్నాడు. దీంతో నాగచైతన్య (Naga Chaitanya), శోభితాల ప్రేమ, పెళ్లి వ్యవహారం ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు వీరిద్దరు ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, ప్రేమ ఎలా మొదలయ్యింది అనే విషయాలపై ఇప్పటికీ పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. పెళ్లి తర్వాత మొదటిసారి ‘తండేల్’ (Thandel) అనే మూవీతో నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండడంతో ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో తనకు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి.
శోభితా సాయం
ఇప్పటికే శోభితా కూడా తెలుగమ్మాయి కావడంతో వారి సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు అన్నీ ఒకటే అని, ఒకరకంగా వారి మనసులు కలవడానికి అవే కారణమని కూడా బయటపెట్టాడు నాగచైతన్య. తను తెలుగు బాగా మాట్లాడుతుందని, ఇద్దరు తెలుగులోనే మాట్లాడుకుంటారని తెలిపాడు. అంతే కాకుండా చైతూ ఎక్కడైనా స్పీచ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే శోభితానే సాయం చేస్తుందట. ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని గైడ్ చేస్తుందట. భాష విషయంలో కూడా చైతూకు శోభితానే సాయం చేస్తుందని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా శోభితా నటించిన వాటిలో తనకు ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్, ‘మేజర్’ సినిమా చాలా ఇష్టమని రివీల్ చేశాడు నాగచైతన్య.
Also Read: ప్రియాంక చోప్రా తమ్ముడి పెళ్లి.. పరిణీతి రాకపోవడానికి ఆ విభేదాలే కారణమా.?
భార్యపై ప్రశంసలు
శోభితా (Sobhita) తెలుగమ్మాయే అయినా తనకు అసలు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. తను నటించిన రెండు సినిమాలు కూడా అడవి శేష్‌తో చేసినవే. అందులో ఒకటే ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో శోభితా కూడా ఒక కీలక పాత్రలో కనిపించింది. ఇందులో తన నటన చాలా బాగుంటుందంటూ భార్యను తెగ పొగిడేశాడు చైతూ. శోభితా సినిమాల్లో మాత్రమే కాదు.. పలు వెబ్ సిరీస్‌లతో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి వెబ్ సిరీస్‌లలో ఒకటే ‘మేడ్ ఇన్ హెవెన్’. ఈ వెబ్ సిరీస్‌లో కూడా తన నటన బాగుంటుందని అన్నాడు నాగచైతన్య. ఇక తను హీరోగా నటించిన ‘తండేల్’ ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధమయ్యింది.