Naga Chaitanya.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు తమ దగ్గర పనిచేసే మేనేజర్లకు, డ్రైవర్లకు, ఇంట్లో పని వాళ్లకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమకోసం పనిచేస్తున్న వారికి సంబంధించి ఏదైనా కార్యాలు జరిగినా, అత్యవసర పరిస్థితులు ఏర్పడినా సరే తామున్నామని అండగా నిలుస్తూ ఉంటారు. సరిగ్గా ఇలాగే తన మంచి మనసును చాటుకున్నారు నాగచైతన్య (Naga Chaitanya). తాజాగా హైదరాబాదులో తన డ్రైవర్ వివాహం అత్యంత ఘనంగా జరిగింది..సెలబ్రిటీల రేంజ్ లో ఆయన వివాహం జరగడమే కాకుండా ఆయన వివాహానికి పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. రాజకీయ నాయకులు కూడా విచ్చేశారు. అంతేకాదు తన డ్రైవర్ కి ఇష్టమని ఖరీదైన గిఫ్ట్ ను ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బహుమతిగా ఇచ్చారు చైతూ. ఇక ఆ బహుమతి ఏంటి? దాని ఖరీదు ఎంత? అనే విషయం తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోకమానరు.
డ్రైవర్ పెళ్లికి కోట్ల ఖర్చు చేసిన నాగచైతన్య – శోభిత..
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తన భార్య సమంత(Samantha) కు విడాకులు ఇచ్చిన తర్వాత మరుసటి ఏడాది ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ (Shobhita dhulipala)తో ప్రేమలో పడ్డారు.ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకొని, డిసెంబర్ 4న వివాహంతో ఒక్కటయ్యారు ఈ జంట. ఇకపోతే డిసెంబర్ 11న నాగచైతన్య దగ్గర డ్రైవర్ గా పనిచేసే వినోద్(Vinodh) పెళ్లి హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి నాగచైతన్య, శోభిత తో పాటు నాగచైతన్య కుటుంబం మొత్తం హాజరయింది. అంటే నాగార్జున(Nagarjuna), అమల(Amala)కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. అంతేకాదు మాజీ మంత్రి, సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా(Roja)వంటి ప్రముఖులు కూడా హాజరవడం జరిగింది. ఇక ఇంత గ్రాండ్ గా ఈ పెళ్లి జరిపించారు నాగచైతన్య. ముఖ్యంగా ఈ పెళ్లికి అయిన ఖర్చు మొత్తం నాగచైతన్య భరించినట్లు సమాచారం.
డ్రైవర్ కలలో కూడా ఊహించని గిఫ్ట్ ఇచ్చిన చైతూ..
ఇదిలా ఉండగా ఈ పెళ్లికి చాలామంది సెలబ్రిటీలు రాగా.. వారంతా కూడా లక్షల రూపాయల విలువ చేసే బహుమతులను వినోద్ దంపతులకు అందజేశారు. ఇక నాగచైతన్య , శోభిత దంపతులు కూడా వినోద్ కి బీఎండబ్ల్యూ కార్ అంటే చాలా ఇష్టమని.. అందులో భాగంగానే రూ .2కోట్ల విలువ చేసే బిఎండబ్ల్యూ కార్ ను బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి సినీ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోతోంది. తన దగ్గర పనిచేసే డ్రైవర్ కోసం రూ .2కోట్ల విలువ చేసే కారు బహుమతిగా ఇవ్వడంతో నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
నాగచైతన్య సినిమాలు..
ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదల కాబోతోంది. మరొకవైపు విరూపాక్ష డైరెక్టర్ ‘కార్తీక్ వర్మ దండు’ డైరెక్షన్లో తన 24వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం.