BigTV English

US Wild Fire : ఆ చేపకు.. కాలిఫోర్నియా మంటలకు ముడిపెట్టిన ట్రంప్ మామ, అసలు ఏంటీ ఆ చేప కథ?

US Wild Fire : ఆ చేపకు.. కాలిఫోర్నియా మంటలకు ముడిపెట్టిన ట్రంప్ మామ, అసలు ఏంటీ ఆ చేప కథ?

US President : ఓ మూడంగుళాల చేప అమెరికాను ముచ్చెమటలు పట్టిస్తోంది. అంతులేని కార్చిచ్చుతో అతలాకుతలం చేస్తోంది. ఈ మాటలు అంటోంది మరెవరో కాదు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎప్పుడు వింతైన మాటాలు, వివాదాస్పద తీరుతో వార్తల్లో నిలిచే ట్రంప్.. అమెరికాలోని విస్తారమైన అడవుల్ని కాల్చేస్తున్న మంటలకు డెల్టా స్మెల్టే అనే చేప కారణంటూ వ్యాఖ్యానించారు. ఆ చేప కారణంగానే మంటల్ని సమర్థవంతంగా నిరోధించలేకపోతున్నట్లు ప్రకటించారు. దాంతో.. ఆయన మాటలు మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైయ్యాయి. ఆ దేశంలోనూ పర్యావరణ వేత్తల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ.. ట్రంప్ చెప్పింది ఏంటి.. డెల్టా స్మెల్ట్ చేపకు కార్చిచ్చుకు ఎలా లంకె కలిపారు.


అమెరికాలోని విస్తారమైన అడవులు అగ్నికీలల్లో కాలిపోతున్నాయి. వారాలుగా చల్లారని మంటలు.. వందలు, వేల ఎకరాల్లోని అటవీ సంపదను కాల్చి బూడిద చేస్తున్నాయి. దాంతో.. ఆ అడవుల్లోని వేలాది జీవరాశులు మంటల్లో ఆహుతవుతున్నాయి. ఇప్పటికే.. ఈ అగ్ని కీలలు సృష్టిస్తున్న విధ్వంసం గురించి అనేక వార్తలు వస్తున్నాయి. కాగా.. కేలిఫోర్నియాలోని మంటల్ని చల్లార్చడానికి.. సరిపడినన్ని నీళ్లు అందుబాటులో లేవని వ్యాఖ్యానించారు. వాస్తవానికి దేశంలోని జల వనరుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నా.. వాటిని కాలిఫోర్నియాకు తరలించేందుకు కొన్ని పర్యావరణ నియమాలు, నిబంధనలు అడ్డంకిగా మారాయని లేదంటే కావాల్సినన్ని నీళ్లతో మంటల్ని అదుపులోకి తీసుకురావచ్చంటూ ప్రకటించారు. ఇలా నీళ్లు రాకుండా అడ్డుకుంది డెల్టా స్మెల్ట్ అనే చిన్న చేప అని తెలిపిన అధ్యక్షుడు ట్రంప్.. దానిని ఓ పనికి రాని చేప అంటూ కామెంట్ చేశారు.

అమెరికాలోని స్వచ్చమైన జలాల్లో పెరిగే ఒక చేప జాతి డెల్టా స్మెల్ట్ (Delta Smelt). రెండు నుంచి నాలుగు అంగుళాల మేర ఉండే ఈ చిన్న చేప జాతి కేలిఫోర్నియాలోని సాక్రమెంటో-సాన్‌ఝాక్విన్ డెల్టా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అనేక రకాల కారణాలతో ఈ చేప జాతి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ విషయాన్ని ఎప్పుడో గుర్తించిన పరిశోధకులు దీన్ని పరిరక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చేపను అంతరించిపోతున్న జాతుల్లో చేర్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలకంగా ఉండే ఈ చేప జాతి.. తగ్గిపోతుండడంతో రానురాను అనేక పర్యావసనాలు ఎదురవ్వొచ్చని భావిస్తున్నారు. అందుకే.. ఈ చేపను కాపాడేందుకు కొన్ని పర్యావరణ చట్టాలను రూపొందించారు. వాటిలో అంతరించిపోతున్న జాతుల చట్టం (Endangered Species Act) ఒకటి. ఈ చట్టం ద్వారా డెల్టా స్మెల్ట్ జాతి చేపల్ని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా.. నీటి వినియోగం, ప్రవాహాల్ని నియంత్రిస్తున్నారు.


సహజ అవాసాల్లో ఈ చేపల జాతివృద్ధి బాగుండేది. కానీ.. నీటి వనరుల్ని గరిష్టస్థాయిలో మానవ అవసరాలకు వినియోగిస్తున్న నేపథ్యంలో.. సహజ నీటి ప్రవాహాలు మారిపోయాయి. నగరాలు, పట్టణాల్లో ప్రజలకు అవసరమైన నీటిని అందించడం, తాగు నీటికోసం కాల్పల నిర్మాణం. సాగు నీటికోసం ప్రవాహాల్ని మార్చడం సహా అనేక కారణాలతో నీటి వనరుల వినియోగం పెరిగిపోయింది.దీంతో.. ఈ రకం చేపలతో పాటు అనేక ఇతర జాతుల చేపల మనుగడ సైతం ప్రశ్నార్థకం అయ్యింది. ఈ పరిస్థితుల్ని గుర్తించిన పరిశోధకులు.. డెల్టా స్మెల్ట్ రకం చేపలు జీవించేందుకు అవసరమైన నీటి ఆవాసాన్ని కల్పించడం, దీని సంరక్షణ కోసం నీటి ప్రవాహం నియంత్రించడం చేస్తున్నారు. వాటి మనుగడను కాపాడేందుకు, పునరుత్పత్తి ద్వారా అభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

Also Read : ప్రపంచదేశాలకు ఆర్థిక సాయం నిలిపివేసిన అమెరికా.. ఇజ్రాయెల్ తప్ప

ఈ విధానాలకు తోడు అమెరికాలోని స్టేట్స్ మధ్య నీటి పంపకాలు, వాటాల విషయంలో రాద్దాంతాలు ఉండనే ఉన్నాయి. అలా.. అనేక కారణాలతో స్టేట్స్ మధ్య నీటి ప్రవాహాల్ని ఇలాంటి జాతుల మనుగడను కాపాడేందుకు పునరుద్ధరించడం, కొన్ని ప్రాంతాలకు అధిక నీటి సరఫరాను నియంత్రిస్తున్నారు. దీంతో.. డెల్టా స్మెల్ట్ రక్షణకు కొన్ని సందర్భాల్లో, నీటిని ఎక్కువగా ఉపయోగించుకోవడం వీలవడం లేదు. ఇది ప్రజల మధ్య వివాదాలకు కారణం అయ్యింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×