BigTV English

Shah Rukh Khan: తప్పు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం.. షారుఖ్ ఖాన్‌కు రూ.9 కోట్లు కట్టాల్సిందే.!

Shah Rukh Khan: తప్పు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం.. షారుఖ్ ఖాన్‌కు రూ.9 కోట్లు కట్టాల్సిందే.!

Shah Rukh Khan: మామూలుగా సినీ సెలబ్రిటీలకు ప్రభుత్వం చాలా సాయం చేస్తుందని, వారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తుందని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ప్రభుత్వాలు, సినీ సెలబ్రిటీల మధ్య కూడా మనస్పర్థలు వస్తుంటాయి. చట్టపరమైన సమస్యలు వస్తాయి. తాజాగా షారుఖ్ ఖాన్‌కు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అలాంటిదే జరిగింది. అనుకోకుండా చేసిన చిన్న తప్పు వల్ల ప్రభుత్వమే షారుఖ్ ఖాన్‌కు రూ. 9 కోట్ల రిఫండ్ కట్టాల్సి వచ్చింది. అసలు ఇలా జరగడం వెనుక కారణం ఏంటనుకుంటున్నారా.? షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) విలాసవంతమైన ఇల్లు ‘మన్నత్’. అక్కడే అసలు సమస్య మొదలయినట్టు తెలుస్తోంది.


రెజిస్ట్రేషన్ ముగిసింది

షారుక్ ఖాన్ నివాసం ‘మన్నత్’ (Mannat) విషయంలో అధికారులు చేసిన చిన్న పొరపాటు వల్ల షారుఖ్ ఖాన్‌కు రూ.9 కోట్ల లాభం రానుంది. ముంబాయ్‌లో బాండ్రా వెస్ట్ బాండ్ స్టాండ్‌లో ఉండే విలాసవంతమైన భవనమే ‘మన్నత్’. ఈ ఇంటికి సంబంధించిన ల్యాండ్ ఓనర్.. దీనిని ఎన్నో ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి లీజ్‌కు ఇచ్చారు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ ఈ ల్యాండ్‌ను కొనాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే ప్రభుత్వం చేతిలో ఈ ల్యాండ్ లీజ్‌కు ఉంది కాబట్టి కొంత డబ్బును ఇచ్చి ఆ ప్రాపర్టీని క్లాస్ 2 లీజ్‌హోల్డ్ నుండి క్లాస్ 1 ఫ్రీ హోల్డ్‌గా మార్చుకున్నాడు. అలా 2,446 చదరపు అడుగుల ల్యాండ్ ఖాన్స్ చేతికి వచ్చింది. దీనిపై రెజిస్ట్రేషన్ కూడా జరిగింది.


ఎక్కువ చెల్లించాం

2019 మార్చిలో ప్రభుత్వం నుండి ఓనర్‌షిప్‌ను తీసుకోవడం కోసం వారు లీజ్‌కు కడుతున్న అమౌంట్ కంటే 25 శాతం ఎక్కువే కట్టారు. అంటే కేవలం ల్యాండ్ కోసమే వారు రూ.27.50 కోట్లు చెల్లించారు. ఈ డబ్బును కూడా వారు పాలసీ ప్రకారమే చెల్లించినట్టు సమాచారం. కానీ ఈ ఫీజ్ లెక్కల్లో తప్పులు ఉన్నాయని తాజాగా తేల్చిన లెక్కల్లో బయటపడింది. 2022లో లెక్కల్లో తప్పులు ఉన్న విషయం షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దృష్టికి వచ్చింది. అధికారులు ల్యాండ్ వాల్యూ కాకుండా బిల్డిండ్ వాల్యూ ప్రకారం లెక్కలు వేశారని, అంటే వారు ఇవ్వాల్సిన దానికంటే రూ.9 కోట్లు ఎక్కువ అమౌంట్‌ను చెల్లించారని గ్రహించారు.

Also Read: ఇన్నాళ్లకు బయటపడ్డ జాన్వీ బ్యూటీ సీక్రెట్.. తక్కువ ఖర్చు ఎక్కువ లాభం..!

రియల్ ఎస్టే్ట్‌పై చర్చలు

వారు కట్టిన ఎక్స్‌ట్రా అమౌంట్‌ను తిరిగి ఇచ్చేయాలంటూ ముంబాయ్ సబర్బన్ డిస్ట్రిక్ట్ (ఎమ్ఎస్‌డీ)కు లెటర్ అందించారు ఖాన్స్. అప్పటినుండి ఇప్పటివరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై విచారణ చేపట్టింది. ఫైనల్‌గా షారుఖ్ ఖాన్ మన్నత్ కోసం కట్టిన ఎక్స్‌ట్రా అమౌంట్ అయిన రూ.9 కోట్లు తిరిగి వారి చేతికొచ్చే సమయం వచ్చేసింది. మన్నత్ గురించి బయటికొచ్చిన ఈ వార్త.. ముంబాయ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఏ రేంజ్‌లో జరుగుతుందో బయటపడేలా చేసింది. దాదాపు ప్రభుత్వమే తమ తప్పు ఒప్పుకొని షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌కు రూ.9 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడింది. కానీ ఈ డబ్బు ఇంకా వారి చేతికి అందలేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×