Naga Chaitanya Thandel Event schedule:అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య (Naga Chaitanya) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తండేల్. ప్రముఖ డైరెక్టర్ చందు మొండేటి (Chandu mondeti) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవి (Sai pallavi) హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చక్కగా ఈవెంట్స్ ప్లాన్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఈ సినిమా విడుదల తేదీ వరకు ఏ రోజు ఏ ఈవెంట్ ప్లాన్ చేయాలి అనే విషయాన్ని కూడా పక్కా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. మరి ఫిబ్రవరి 7వ తేదీన రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ఏ రోజున ఏ ఈవెంట్ ప్లాన్ చేశారో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళితే.. జనవరి 26వ తేదీన తండేల్ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఆ తరువాత అనగా జనవరి 27వ తేదీన చిత్ర బృందం మొత్తం ఇంటర్వ్యూ ఇవ్వనుంది. 28వ తేదీ కాస్త గ్యాప్ తీసుకొని, 29న మళ్లీ ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. జనవరి 30వ తేదీన ముంబైలో షోలు వేయనున్నట్లు సమాచారం. అలాగే జనవరి 31వ తేదీన చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి ఒకటవ తేదీన కేరళలో ప్రెస్ మీట్ పెట్టి, సినిమా ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2వ తేదీన వైజాగ్లో ఈ తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అలాగే ఫిబ్రవరి 3వ తేదీన చిత్ర బృందంతో కలిసి ఫోటోషూట్ ఉంటుంది. ఫిబ్రవరి 4వ తేదీన హైదరాబాద్ కాలేజీలో ఒక ఈవెంట్ నిర్వహించి, ఫిబ్రవరి 5వ తేదీన తిరుపతి వెళ్లి దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందనున్నారు. ఇక ఫిబ్రవరి 6వ తేదీన ప్రీమియర్ షో నిర్వహించి, ఫిబ్రవరి 7వ తేదీన సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికైతే సినిమా విడుదల తేదీ వరకు పక్కా ప్రణాళికను రూపొందించి, ఏ రోజు ఏమేం చేయబోతున్నారో అభిమానులకు తెలియజేయడంతో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు.
తండేల్ సినిమా కథ..
తండేల్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. 2018లో జరిగిన రియల్ కథను.. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రచయిత కార్తీక్ తీడా ఎంతో రీసెర్చ్ చేసి మరీ ఈ కథను రాసుకోవడం జరిగింది. ఫిషర్ మెన్స్ తో రెండు మూడు నెలలు స్వయంగా ఉండి, వాళ్లతోనే తింటూ, వాళ్లలో ఒకడిలా కలిసిపోయి వారితో ప్రయాణం చేస్తూ మరీ వారి జీవనశైలిని పూర్తిగా తెలుసుకొని ఈ సినిమా కథను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు నాగచైతన్య కూడా సినిమాలో పాత్రలో డెప్త్ తెలియడానికి వాళ్లతోనే కొద్ది రోజులు ప్రయాణం చేసినట్లు సమాచారం. గీత ఆర్ట్స్ బ్యానర్ వారికి స్టోరీని వినిపించగా నచ్చడంతో ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇందులో సాయి పల్లవి, నాగచైతన్య మధ్య కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోబోతుందని చెప్పవచ్చు.