Stress Robber| ఎవరైనా సరదా కోసం ఏదైనా సినిమాకో, షికారో వెళతారు. లేదా ఏదైనా ఆట ఆడుతారు. ఒత్తిడిగా అనిపిస్తే కొంత సమయం విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఒక వ్యక్తి సరదా కోసం దొంగతనానికి వెళ్లేవాడు. ఏకంగా 1000 ఇళ్లలో దొంగచాటుగా వెళ్లాడు. చివరికి పట్టుబడ్డాక “అంతా తూచ్ నేను దొంగను కాను.. కేవలం సరదా కోసం చేశా” అని చెప్పాడు.
వివరాల్లోకి వెళితే.. జపాన్‌లో ఒక యువకుడికి నిద్ర పట్టేది కాదు. ఏది తినాలనిపించేది కాదు. ఉద్యోగంలో చాలా ఒత్తిడి ఉండడం, ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండడంతో ప్రశాంతంగా ఉండలేకపోయేవాడు. దీంతో అతను ఉద్యోగం మారాడు అయినా సమయానికి నిద్ర పట్టేది కాదు. ఎప్పుడూ ఏదో కోల్పోతున్నట్లు భావన. జీవితం అనాసక్తిగా ఉందని ఆలోచిస్తూ ఉండేవాడు.
అందుకే లైఫ్ లో థ్రిల్ ఉండాలని భావించి తన పక్కింట్లోకి రాత్రివేళ దొంగచాటుగా వెళ్లాడు. అక్కడ చిన్నపిల్లల బొమ్మలు కాజేశాడు. ఇంతలో ఇంట్లో అలికిడి కావడంతో భయపడుతూ మళ్లీ క్షేమంగా తిరిగొచ్చేశాడు. ఆ కాసేపు అతనికి వణుకు పుట్టింది. కాళ్లు చేతుల్లో చెమటలు పట్టాయి. ఆ రోజు రాత్రి అతని హాయిగా నిద్రపట్టింది. దీంతో అతను ప్రతి రోజు ఇళ్లలో దొంగతనానికి వెళ్లే వాడు. కానీ అక్కడి నుంచి పెద్దగా విలువలేని వస్తువులు తీసుకొచ్చేవాడు. అలా గత మూడేళ్లుగా చేస్తేనే ఉన్నాడు.
Also Read: 69 ఏళ్ల నకిలీ ఐపిఎస్ ఆఫీసర్.. అమిత్ షా సలహాదారుడిగా చలామణి.. ఎలా చేశాడంటే
అయితే వారం రోజుల క్రితం ఒక ఇంట్లో దొంగతనం చేస్తుండగా పట్టుబడ్డాడు. ఆ ఇంట్లో అతను దొంగచాటుగా వెళ్లినప్పుడు ఇంటి ఓనర్, అతని భార్య ఈ యువకుడిని చూసి చాకచక్యంగా ఒక గదిలో బంధించారు. ఆ తరువాత పోలీసులకు పట్టించారు. పోలీసులు అతడిని ప్రశ్నించగా.. తాను సరదా కోసం దొంగతనాలు చేస్తూ ఉంటానని చెప్పాడు. కానీ పోలీసులు అతడి మాటలను నమ్మలేదు. అప్పుడతను తాను దొంగతనాలు చేసిన ఇంటి అడ్రస్ చెప్పగా.. పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేశారు. వారంతా తమ ఇళ్ల నుంచి చిన్న చిన్న వస్తువులు పోయినట్లు ధృవీకరించారు.
పోలీసులు విచారణలో ఆ యువకుడు మొత్తం 1000 ఇళ్లలో దొంగతనం చేసినట్లు తేలింది. చట్టప్రకారం.. యువకుడిపై దొంగతనం కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జిగారు అతనికి మానసిక చికిత్స అవసరమని మెంటల్ ఆస్పత్రి పంపిచాలని ఆదేశించారు.
ఆత్మహత్య చేసుకున్న మహిళపై హత్య కేసు
జపాన్ లో ఇటీవల మరో వింత కూడా జరిగింది. ఒక ఆత్మహత్య చేసుకున్న టీనేజర్ అమ్మాయిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒక 17 ఏళ్ల అమ్మాయి ఒక ఎత్తైన బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకునేందకు కిందకు దూకింది. అయితే అదే సమయంలో బిల్డింగ్ కింద ఒక మహిళ నిలబడి ఉంది.
అమ్మాయి బిల్డింగ్ పై నుంచి దూకే క్రమంలో కింద ఉన్న మహిళపై పడింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. దీంతో పోలీసులు ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి నిర్లక్ష్యం వల్లే మహిళ చనిపోయిందని.. అందు వల్ల ఆత్మహత్య చేసుకున్న అమ్మాయిపై మహిళ హత్య కేసు నమోదు చేశారు.