BigTV English

Devara: ‘దేవర’ టికెట్ రేట్లు పెరగడానికి పవన్ కళ్యాణే కారణం.. నాగవంశీ కామెంట్స్

Devara: ‘దేవర’ టికెట్ రేట్లు పెరగడానికి పవన్ కళ్యాణే కారణం.. నాగవంశీ కామెంట్స్

Devara Movie: యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమే ‘దేవర’. ఈ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికీ పలు థియేటర్లలో ఈ మూవీ సక్సెస్‌ఫుల్గా రన్ అవుతోంది. కలెక్షన్స్ విషయంలో కూడా ‘దేవర’ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీకి ఓ రేంజ్‌లో కలెక్షన్స్ రావడానికి ఎక్స్‌ట్రా షోలు, టికెట్ ప్రైజ్ పెరగడం కూడా కారణమే అని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. ‘దేవర’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసి లాభాలను పొందాడు నాగవంశీ. తాజాగా ‘దేవర’ సక్సెస్‌పై, టికెట్ రేట్లు పెరగడంపై నాగవంశీ స్పందించాడు.


Also Read: ఆ తప్పే గుంటూరు కారం సినిమాకి మైనస్.. నిర్మాత హాట్ కామెంట్స్..!

ఆయనకే క్రెడిట్


‘దేవర టికెట్ హైక్ క్రెడిట్ అంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కే చెందుతుంది. ఇండస్ట్రీ బాగుండాలనే కారణంతో మేము అడిగినంత హైక్ ఓకే చేశారు’ అంటూ నాగవంశీ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ‘దేవర’ మూవీ విడుదలయినప్పుడు టికెట్ హైక్స్‌ను చూసి ప్రేక్షకులు షాకయ్యారు. విపరీతంగా టికెట్ రేట్లను పెంచేశారని ఫీలయ్యారు. దాదాపు నాలుగు రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలతోనే ‘దేవర’ థియేటర్లలో నడిచింది. దీంతో ఫస్ట్ వీకెండ్ ముగిసి రెండోవారంలో అడుగుపెట్టేసరికి ‘దేవర’ కలెక్షన్స్ ఓ రేంజ్‌లో దూసుకుపోయాయి. అలా టికెట్ హైక్స్ కూడా ఈ సినిమా కలెక్షన్స్ పెరగడంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు దాని క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్‌కే ఇచ్చేశాడు నాగవంశీ.

హిట్ కాంబినేషన్

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు ఎన్‌టీఆర్. తనకు ఇండియాలో మాత్రమే కాకుండా ఫారిన్‌లో కూడా ఫ్యాన్ బేస్ పెరిగింది. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్‌టీఆర్ నటించే సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్ అంతా ఎదురుచూశారు. కొరటాల శివతో సినిమా అనగానే కొందరు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయితే మరికొందరు మాత్రం ఆందోళనకు గురయ్యారు. హ్యాపీ ఎందుకంటే అప్పటికే ఎన్‌టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ అనే హిట్ వచ్చింది. అలాగే ఆందోళన చెందడానికి కొరటాల ఫార్మ్‌లో లేకపోవడంతో పాటు మరెన్నో కారణాలు ఉన్నాయి.

సెంటిమెంట్స్ బ్రేక్

రాజమౌళి కెరీర్‌లో అసలు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అలాగే తనతో కలిస పనిచేసిన ప్రతీ హీరోకు హిట్ ఇచ్చాడు ఈ దర్శక ధీరుడు. కానీ తనతో సినిమా చేసిన హిట్ కొట్టిన తర్వాత ఏ హీరోకు కూడా హిట్ దక్కలేదు. అలాగే రామ్ చరణ్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘ఆచార్య’ మూవీలో నటించగా అది డిశాస్టర్ అయ్యింది. ‘ఆచార్య’ తెరకెక్కించిన ఫ్లాప్ డైరెక్టర్‌తో ఎన్‌టీఆర్ సినిమా చేస్తే.. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అవ్వడం సాధ్యమవుతుందా అని చాలామంది ప్రేక్షకుల్లో అనుమానం కలిగింది. కానీ దాంతో పాటు మరెన్నో సెంటిమెంట్స్‌ను బ్రేక్ చేసి ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి రన్‌తో దూసుకుపోతోంది ‘దేవర’.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×