BigTV English

Snake Bite Anitvenom Human Blood: భయంకర పాము విషానికి విరుగుడు మందు.. ఆ మనిషి రక్తమే

Snake Bite Anitvenom Human Blood: భయంకర పాము విషానికి విరుగుడు మందు.. ఆ మనిషి రక్తమే

Snake Bite Anitvenom Human Blood| ఏనుగు లాంటి భారీ ఆకారము, బలమైన జంతువులను కూడా ఒక్క కాటుతో చంపగల జీవి పాము. అందుకే పాముకు వీలైనంత దూరంగా ఉండాలంటారు పెద్దలు. ఒకవేళ పాముకాటుకు గురైతే దీనికి విరుగుడుగా గుర్రం రక్తం నుంచి తీసిన యాంటీ బాడీలను ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు తాజాగా ఒక మనిషి రక్తం పాము రక్తానికి విరుగుడుగా అద్భుతంగా పనిచేసింది. ఆ మనిషికి ఎంత భయంకరమైన విషపు పాము కాటేసినా అతను చనిపోడు. అందుకే శాస్త్రావేత్తలు అతని రక్తాన్ని పరీక్షించి దాని నుంచి పాము విషానికి విరుగుడు తయారు చేశారు. మొత్తం 16 రకాల ప్రాణాంతక జాతుల పాములు విషానికి ఇది సమర్థవంతంగా విరుగుడని తాజాగా తేలింది.


ఇప్పటివరకు తయారైన వాటిలో ఇదే అత్యంత ప్రభావవంతమైన యాంటీ వెనమ్ అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అద్భుతమైన విరుగుడును పాముకాటు చికిత్సలో అత్యంత విప్లవాత్మకమైన పురోగతిగా వారు పరిగణిస్తున్నారు.

ఇది ఎలా సాధ్యమైందంటే?
సినిమాల్లో హీరోలకు చిన్నప్పటి నుంచే కొద్ది మోతాదులో విషాన్ని ఇవ్వడం చూసే ఉంటారు. ఆ తరువాత అతను పెరిగి పెద్దయ్యాక ఏ పాము కరిచినా ఆ హీరోపై ప్రభావం ఉండదు. ఇలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. అమెరికాలో కాలిఫోర్నియాలో నివసించే తిమోతీ ఫ్రైడ్ అనే వ్యక్తి ఇలాంటి పద్ధతిని అక్షరాలా అనుసరించాడు. మొత్తం 18 సంవత్సరాల వ్యవధిలో తిమోతీ ప్రయోగాత్మకంగా 200 సార్లకు పైగా పాములతో కరిపించుకున్నాడు. పాము విషాన్ని తన శరీరంలోకి 700 సార్లకు పైగా ఎక్కించుకున్నాడు!


ఈ ప్రమాదకర పాములతో ప్రయోగం
బ్లాక్ మాంబా, ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. రాచనాగు, టైగర్ స్నేక్, రాటిల్ స్నేక్ వంటి పాములు కూడా ఈ జాతిలోనివే. ఇలాంటి విషపూరిత పాములతో పదే పదే కరిపించుకున్న తిమోతీ గురించి అమెరికాకు చెందిన వ్యాక్సీన్ కంపెనీ సెంటివాక్స్ సీఈఓ జాకబ్ గ్లెన్‌విల్లే 2017లో ఎక్కడో చదివారు. తిమోతీ విషాన్ని వందల సార్లు తన శరీరంలోకి ఎక్కించుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు. తిమోతీ ట్రక్ మెకానిక్‌గా పనిచేసేవాడు. తర్వాత పాముల గురించి ఆసక్తికరమైన వీడియోలు చేసి ప్రసిద్ధి గడించాడు. ఈ క్రమంలో ఒకసారి రెండు నాగుపాములు వరుసగా కరవడంతో కోమాలోకి వెళ్లిపోయాడు.

మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు విషాన్ని శరీరంలోకి ఎక్కించుకోవడం ప్రారంభించాడు. తిమోతీ అనుమతితో గ్లెన్‌విల్లే అతని రక్త నమూనాలను సేకరించారు. ఏ పాము విషాన్నైనా తట్టుకునే శక్తిమంతమైన యాంటీబాడీలు అతని రక్తంలో పుష్కలంగా ఉన్నట్టు కనుగొన్నారు. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య శాస్త్ర నిపుణుడు రిచర్డ్ స్టాక్ తదితరుల సహాయంతో శాస్త్రవేత్తలు ఆ యాంటీబాడీలను సేకరించారు. ఎనిమిది సంవత్సరాల పాటు సుదీర్ఘ పరిశోధనలు చేసి, ఆ యాంటీబాడీల సాయంతో అత్యంత ప్రభావవంతమైన యాంటీ వెనమ్ ఇంజెక్షన్‌ను తయారు చేశారు. దీనికి ఎల్‌ఎన్‌ఎక్స్–డీ09 అని నామకరణం చేశారు.

Also Read: చోరీ కారును ఓనర్‌కే విక్రయించిన దొంగలు.. కారు నెంబర్ మార్చినా ఎలా గుర్తు పట్టాడంటే?

ప్రయోగాత్మకంగా బ్లాక్ మాంబాతో సహా 19 అత్యంత విషపూరిత పాముల విషాన్ని ఒక్కొక్కటిగా ఎలుకలకు ఎక్కించి, ఆ తర్వాత ఈ విరుగుడును ఇచ్చారు. బ్లాక్ మాంబాతో పాటు 13 రకాల విషాల నుంచి ఎలుకలను ఈ యాంటీ వెనమ్ కాపాడిన విధానాన్ని చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు! ఆరు రకాల అత్యంత విషపూరిత పాముల విషాన్ని కలిపి ఇచ్చినప్పుడు కూడా అదే ఫలితం వచ్చింది. మిగిలిన 6 రకాల విషాలకు కూడా ఎల్‌ఎన్‌ఎక్స్–డీ09 పాక్షికంగా విరుగుడుగా పనిచేసింది. ఈ యాంటీ వెనమ్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉందని గ్లెన్‌విల్లే తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలను తాజాగా ‘సెల్’ అనే సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించారు.

యాంటీ వెనమ్ తయారీ చాలా కష్టం
యాంటీ వెనమ్ తయారీ అనేది సంక్లిష్టమైన ప్రక్రియ. పాముల నుంచి సేకరించిన విషాన్ని చిన్న మోతాదులలో గుర్రాల వంటి జంతువులకు ఎక్కిస్తారు. ఆ విషానికి వాటి శరీరంలో రోగనిరోధక శక్తి ఏర్పడిన తర్వాత, వాటి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలతో విరుగుడును తయారు చేస్తారు. అయితే, ఈ ప్రక్రియ శ్రమతో కూడినదే కాకుండా ప్రమాదకరమైనది కూడా. చాలా సందర్భాల్లో ఈ విరుగుడు సరిగా పనిచేయకపోవడమే కాక, తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా పాముకాటు కారణంగా ప్రతి సంవత్సరం 1.4 లక్షల మంది మరణిస్తున్నట్టు అంచనా. సుమారు 4 లక్షల మంది వికలాంగులుగా మారుతున్నారు. గ్వాటెమాలా గ్రామాల్లో పెరిగిన గ్లెన్‌విల్లే ఈ సమస్యకు మెరుగైన, శాశ్వతమైన పరిష్కారం కోసం ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. ఎల్‌ఎన్‌ఎక్స్–డీ09 ఆ పరిష్కారంగా నిలుస్తుందని ఆయన ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.

Related News

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

Big Stories

×