Nandamuri Balakrishna :సాధారణంగా సినిమా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి.. వారు బయటకొస్తే.. ఆడియన్స్ ను కంట్రోల్ చేయడం, వారి నుండీ సెలబ్రిటీలు తమను తాము కాపాడుకోవడం అత్యంత కష్టంతో కూడుకున్న పని. అందుకే బాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు హీరోలు మొదలుకొని హీరోయిన్ ల వరకు చాలా మంది పబ్లిక్ నుండీ తమను తాము కాపాడుకోవడానికి బౌన్సర్లను నియమించుకుంటారు. అంతేకాదు వీరికి లక్షల రూపాయలను పారితోషికంగా ఇచ్చి మరీ నియమించుకుంటూ వుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అయితే ఏకంగా కోట్ల రూపాయలను జీతంగా ఇస్తున్న విషయం తెలిసిందే.
బౌన్సర్లను పెట్టుకోవడంపై స్పందించిన బాలయ్య..
అయితే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna) మాత్రం బౌన్సర్లను నియమించుకోలేదు. అటు రాజకీయ పరంగా.. ఇటు సినిమాల పరంగా వరుస సక్సెస్ లతో జోరు మీద వున్న బాలయ్యకి అభిమానులు ఏ రేంజ్ లో వుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బయట కనిపిస్తే చాలు.. కరచాలనం చేయాలని, ఫోటోలు దిగాలని తెగ తాపత్రయ పడుతుంటారు. మరి ఇలాంటి వాళ్ళందరికీ దూరంగా.. తనను తాను సేఫ్ చేసుకోవాలంటే రక్షకులు కావాల్సిందే.కానీ బాలయ్య మాత్రం అవసరం లేదంటున్నారు. మరి అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
బాడీగార్డ్ అవసరం లేదంటున్న బాలయ్య..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒకే ఒక్క హీరో బాలయ్య అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈయన మాత్రం ఒకరిద్దరిని సెక్యూరిటీగా తప్ప బౌన్సర్లను మాత్రం పెట్టుకోలేదు. దీనికి ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. అదిరిపోయే సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు బాలయ్య. ఇదే విషయంపై బాలయ్య మాట్లాడుతూ..” నాకు బాడీగార్డ్స్ అవసరం లేదు. ఎందుకంటే నాకు నేనే బాడీగార్డ్” అంటూ బాలకృష్ణ తెలిపారు. వాస్తవానికి తాను బాడీగార్డ్స్ ను పెట్టుకోకపోవడానికి కూడా ఇంకొక కారణం ఉందని బాలయ్య తెలిపారు. బాలయ్య మాట్లాడుతూ.. నా అభిమానులు చాలా క్రమశిక్షణ కలిగిన వారు.. కాబట్టి నాకు బౌన్సర్లు అవసరము లేదు” అంటూ తెలిపారు బాలకృష్ణ.మొత్తానికైతే బాలయ్య బౌన్సర్లు అవసరం లేదని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఇదిలా ఉండగా కొందరు అభిమానులు హీరోల దగ్గరకు వెళ్లి వాళ్ళ కాళ్లపై ఉన్నఫలంగా పడతారు. ఈవెంట్స్ లో ఇలాంటి దృశ్యాలు మనం చూస్తూనే ఉంటాం. దీంతో వెంటనే బౌన్సర్లు స్పందించి, వాళ్ళని పక్కకు నెట్టేస్తూ ఉంటారు. బాలయ్యతో అలా ప్రవర్తించి.. ఆయన చేతిలో అభిమానులు దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకేనేమో బాలయ్య కొడతారు అనే భయంతో కూడా అభిమానులు క్రమశిక్షణ పాటిస్తూ ఆయన దగ్గరకు వెళ్ళరని సమాచారం.
బాలయ్య సినిమాలు..
బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ఇటీవల సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బాలయ్య. ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇందులో ప్రగ్యా జైస్వాల్, చాందిని చౌదరి, ఊర్వశి, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ల గా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.