Balakrishna: నందమూరి బాలకృష్ణ కెరియర్ లో మంచి మలుపు తీసుకొచ్చిన షో అన్ స్టాపబుల్. ఆ షో ముందు బాలయ్య ను చూసిన విధానం, ఆ షో తర్వాత బాలయ్యను చూసిన విధానం రెండు కంప్లీట్ గా మారిపోయాయి. అన్ స్టాపబుల్ ముందు బాలయ్యను చాలా మంది కొన్ని విషయాల్లో అపార్థం చేసుకున్నారు. ఒక్కసారి అన్ స్టాపబుల్ మొదలైన తర్వాత అందరికీ బాలకృష్ణ మీద ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. చాలామంది యంగ్ హీరోలు కూడా బాలయ్య బాబుకు బాగా క్లోజ్ అయిపోయారు.
ముఖ్యంగా విశ్వక్సేన్ సిద్దు జొన్నలగడ్డ అడవి శేషు వంటి హీరోలతో బాలకృష్ణ మాట్లాడిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. అలానే ప్రభాస్ తో బాలకృష్ణ మాట్లాడిన సందర్భంలో రామ్ చరణ్ కి కూడా నందమూరి బాలకృష్ణ కు ఎంత క్లోజ్ అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఈ షో తర్వాతే బాలకృష్ణ వరుసగా మూడు హిట్ సినిమాలు అందుకున్నారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమా అంటే కూడా అంచనాలు అదే రేంజ్ లో ఉంటాయి.
ఒకప్పుడు మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి ఒక కోల్డ్ వార్ జరుగుతూ ఉండేది. మేము గొప్ప అంటే మేము గొప్ప అంటూ చరిత్రల గురించి రికార్డుల గురించి అప్పట్లో సినిమాల్లో డైలాగులు కూడా ఉంటూ ఉండేవి. అయితే వాటన్నిటిని ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్ గా తీసుకొని అప్పట్లో ఫ్యాన్ వార్స్ కూడా మొదలుపెట్టారు. ఇక రీసెంట్ టైమ్స్ లో నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య వివాదాలు పూర్తిగానే తగ్గిపోయాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణకి క్లోజ్ కావటం దీనికి ఒక కారణం కూడా చెప్పొచ్చు.
Also Read: HBD Preity Zinta: మహేష్ బాబు బ్యూటీ ప్రీతి జింటా ఎంత ఆస్తి కూడబెట్టిందో తెలుసా..?
ఇక తాజాగా బాలకృష్ణకు పద్మ భూషణ్ పురస్కారం లభించిన విషయం తెలిసిందే. దీని గురించి బాలకృష్ణ మాట్లాడుతూ చాలా విలువైన వ్యాఖ్యలను తెలిపారు.నాకు పద్మ భూషణ్ ఇవ్వడం అంటే నా చలన చిత్ర పరిశ్రమకు రావడమే,నా హిందూపూర్ ప్రజలకు రావడమే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు రావడమే అంటూ బాలకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడితో నందమూరి బాలయ్య మరో మెట్టు ఎక్కేశాడు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా బాలకృష్ణ కెరియర్ లో అన్ స్టాపబుల్ అనే షో ఒక మైలురాయి అని చెప్పొచ్చు.మొదట బాలయ్యతో టాక్ షో అనగానే బాలకృష్ణతో టాక్ షో ఏంటి అని చాలామంది పెదవి విరిచారు. అయితే బాలకృష్ణ అన్స్టాబుల్ చేసిన తర్వాత చాలామంది బాలకృష్ణను చూసే విధానం మారిపోయింది. బాలకృష్ణ జెన్యూన్ వ్యక్తిత్వం ఏంటి అని చాలామందికి అప్పుడే అర్థమైంది. అందుకే ఆయన సినిమాలకి కూడా సరైన ఆదరణ లభించింది.
Also Read: Thandel Movie Story : తండేల్ మూవీలో వైఎస్ జగన్ చేసిన పనులు… జగన్ ఫ్యాన్స్‌కి ఇక ఫుల్ కిక్