PV Sindhu: భారత స్టార్ బ్యాడ్మింటన్, రెండుసార్లు ఒలంపిక్స్ పతక విజేత పీవీ సింధు {PV Sindhu} ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పీవీ సింధు పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. తాజాగా తనకు కాబోయే భర్త వెంకటదత్త సాయితో సింధు ఎంగేజ్మెంట్ జరిగింది. శనివారం (డిసెంబర్ 14) న నిశ్చితార్థం జరిగిన ఫోటోలను పివి సింధు {PV Sindhu} సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కాబోయే వధూవరులు పీవీ సింధు – వెంకట దత్త సాయి ఉంగరాలు మార్చుకున్నారు.
Read Also: Mohammed Shami: రోహిత్ శర్మ టార్చర్.. రిటైర్మెంట్ దిశగా షమీ..?
అలాగే ఇద్దరు కలిసి కేక్ కట్ చేసిన ఫోటోలను సింధు {PV Sindhu} ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఓ ఆసక్తికరత్ క్యాప్షన్ జత చేశారు. “ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు.. తిరిగి మనం ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ తనంతట తాను ఏం ఇవ్వదు” అంటూ మనసుని కదిలించే క్యాప్షన్ జత చేశారు. దీంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఎంగేజ్మెంట్ నేపథ్యంలో పలువురు సినీ, క్రీడా ప్రముఖులు, అభిమానులు, నెటిజెన్లు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక వీరి వివాహం ఈనెల 22న రాజస్థాన్ లో జరగనుంది. ఉదయపూర్ ప్యాలెస్ లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 24న హైదరాబాద్ లో రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేశారు. వీరి పెళ్లి వేడుకకి ఇప్పటికే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా వంటి ప్రముఖులను ఆహ్వానించారు. ఇక సింధు {PV Sindhu} కి కాబోయే భర్త వెంకట దత్త సాయి హైదరాబాద్ కి చెందిన ఓ ఐటి ప్రొఫెషనల్. ఈయన 2018లో ఫ్లేమ్ యూనివర్సిటీ నుండి ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ లో బిబిఏ పూర్తి చేశాడు.
అలాగే బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ లో మాస్టర్స్ పొందాడు. ప్రస్తుతం ఈయన సోర్ ఆపిల్ అసెట్ మేనేజ్మెంట్ లో మేనేజింగ్ డైరెక్టర్ గా అలాగే పోసిడెక్స్ టెక్నాలజీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఇక పీవీ సింధు – వెంకట దత్త సాయి కుటుంబాలకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. ఈ పరిచయం వీరి పెళ్లితో అది మరింత పటిష్టం కానుంది.
Also Read: IND vs AUS: ఫీల్డింగ్ చేస్తుండగా మహమ్మద్ సిరాజ్ కి ఘోర అవమానం
సింధు {PV Sindhu} జనవరి నుంచి వరుస టోర్నీలు ఆడబోతోంది. అందువల్ల సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేయాలని భావించారు ఆమె తండ్రి. ఈ క్రమంలో డిసెంబర్ 22న పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక భారత దేశపు గొప్ప అథ్లెట్లలో ఒకరైన సింధు 2019లో ఒక స్వర్ణంతో సహా 5 ప్రపంచ ఛాంపియన్ పథకాలను గెలిచింది. అలాగే రియో 2016 మరియు టోక్యో 2020లో వరుసగా రజతం మరియు కాంస్యాన్ని గెలుచుకుంది. ఇక ఇటీవల లక్నోలో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్ ని కైవసం చేసుకుంది పీవీ సింధు.