Hit 3: చాలావరకు హీరో, హీరోయిన్లు ఒక రకమైన కంఫర్ట్ జోన్‌లో ఉంటూ వరుసగా ఒకే విధమైన సినిమాలు చేస్తుంటారు. అప్పుడప్పుడు కొత్త కథలతో రిస్క్ తీసుకోవాలని అనిపించినా వారి ఫ్యాన్ బేస్ ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటారు. కానీ ఈరోజుల్లో చాలావరకు హీరోలు కొత్త కథలతో, ముందెప్పుడూ చేయని క్యారెక్టర్లతో రిస్క్ తీసుకోవడానికే ఇష్టపడుతున్నారు. అలాంటి వారిలో నాని కూడా యాడ్ అయ్యాడు. వరుసగా పక్కింటబ్బాయి పాత్రలతో నేచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. అలాంటిది మొదటిసారి తన ఫ్యాన్‌బేస్‌ను రిస్క్ చేసి మరీ ‘హిట్ 3’ సినిమాలో వైలెంట్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అయినా ఇప్పటికే ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టింది.
షాకిచ్చిన నాని
హీరోగా మంచి గుర్తింపు సాధించిన తర్వాత నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు నాని. అలా ఇప్పటికే పలువురు యంగ్ డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అలాంటి వారిలో శైలేష్ కొలను ఒకడు. ‘హిట్’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు శైలేష్ కొలను. ఆ సినిమాను నాని నిర్మించాడు కానీ హీరోగా నటించలేదు. ఇప్పటికే ‘హిట్’ ఫ్రాంచైజ్‌లో రెండు సినిమాలు వచ్చినా ఆ రెండిటికీ తను కేవలం నిర్మాతగానే వ్యవహరించాడు. ఇక ఈ ఫ్రాంచైజ్‌లోని మూడో సినిమాను తను కేవలం నిర్మించడం మాత్రమే కాకుండా హీరోగా కూడా మారాడు. కానీ ‘హిట్ 3’లో నానిని చూడగానే ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పుడు ఈ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఓవర్సీస్ రికార్డ్
‘హిట్ 3’లో అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నాడు నాని (Nani). ఇది ఒక వైలెంట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఇంతకు ముందెప్పుడూ నానిని ఇంత వైలెంట్‌గా చూడలేదు ప్రేక్షకులు. అలాంటిది ఒక్కసారిగా నాని ఏంటి ఇలా మారిపోయాడు అంటూ చర్చలు మొదలయ్యాయి. తన క్యారెక్టర్‌పై కాస్త నెగిటివిటీ కూడా వచ్చింది. అయినా కూడా నాని అవేమీ పట్టించుకోలేదు. ఒకవైపు ‘హిట్ 3’పై నెగిటివిటీ వస్తుండగానే మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో బుకింగ్స్ మొదలుపెట్టింది. మే 1న ఈ సినిమా విడుదల కానుంది. అంటే దాదాపు ఈ సినిమా విడుదలకు ఇంకా పదిరోజులు ఉంది. అప్పుడే అమెరికాలో ‘హిట్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
Also Read: అదంతా అయ్యే పనులు కాదు.. రివ్యూలపై నాని సూపర్ స్టేట్‌మెంట్
అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు
అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఇప్పటికే 75 వేల డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసింది ‘హిట్ 3’. నాని కెరీర్‌లో ఒక సినిమాకు ఈ రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఇదే మొదటిసారి. పైగా మూవీ విడుదలకు ఇంకా పదిరోజులు ఉండగానే 75 వేల మార్క్‌ను టచ్ చేసిందంటే విడుదలయ్యే సమయానికి కచ్చితంగా 1 మిలియన్ డాలర్ల మార్క్ టచ్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్ 3’ (Hit 3)లో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజ్‌తో పాన్ ఇండియా వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీనిధి శెట్టి.. ఇప్పుడు ‘హిట్ 3’తో తెలుగు డెబ్యూకు సిద్ధమయ్యింది.