BigTV English
Advertisement

Nani: సౌత్ ఆడియన్స్‌పై సల్మాన్ ఖాన్ కామెంట్స్.. నాని సీరియస్ రియాక్షన్

Nani: సౌత్ ఆడియన్స్‌పై సల్మాన్ ఖాన్ కామెంట్స్.. నాని సీరియస్ రియాక్షన్

Nani: ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల రేంజ్‌కు, ఆ మార్కెట్‌కు సౌత్ సినిమాలు సరిపోయేవి కాదు. ఒక హిందీ సినిమా విడుదల అవుతుందంటే దానిని చూడడానికి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు సిద్ధంగా ఉండేవారు. అలాంటిది గత కొన్నేళ్లలో తెలుగు నుండి పాన్ ఇండియా సినిమాలు రావడం మొదలయ్యింది. అంతే కాకుండా ఆ పాన్ ఇండియా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అందరినీ ఎంటర్‌టైన్ కూడా చేశాయి. దీంతో బాలీవుడ్ వెనకబడిపోయింది. దాని వల్ల బీ టౌన్ స్టార్ హీరోలంతా సౌత్‌పై అసూయ పెంచేసుకున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉండగా వాటిపై నేచురల్ స్టార్ నాని తాజాగా స్పందించాడు. సౌత్ ఆడియన్స్‌పై సల్మాన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు రియాక్ట్ అయ్యాడు.


నాని రియాక్షన్

కొన్నిరోజుల క్రితం మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటించిన ‘సికందర్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సమయంలో సౌత్ ప్రేక్షకులు హిందీ సినిమాలు చూడడం మానేశారంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు ఈ సీనియర్ హీరో. తను ఎక్కడైనా కనిపిస్తే సౌత్ ప్రేక్షకులంతా ప్రేమగా భాయ్ అని పిలుస్తారని కానీ తన సినిమాలు చూడడానికి థియేటర్లకు మాత్రం రారు అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ అలా అనడం చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలకు మాత్రమే కాదు.. బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా నచ్చలేదు. ప్రస్తుతం ‘హిట్ 3’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నాని సైతం ఈ స్టేట్‌మెంట్‌పై తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.


దశాబ్దాలుగా ఆదరించారు

‘‘సౌత్ సినిమాలు అనేవి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంటున్న దానికంటే ముందే హిందీ సినిమాలను సౌత్ ఇండియా అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. బాలీవుడ్‌కు ఎన్నో దశాబ్దాలుగా సౌత్ నుండి ఆదరణ లభించింది. అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోతో, ఆయన సినిమాలతో సౌత్ ప్రేక్షకులకు ఎంతో అనుబంధం ఉంది. కుచ్ కుచ్ హోతా హై, దిల్ తో పాగల్ హై వంటి చిత్రాలు సౌత్ రాష్ట్రాల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం సౌత్ సినిమాలను దేశవ్యాప్తంగా ఆదరిస్తున్నారు. అలాగే హిందీ చిత్రాలు కూడా తక్కువేమీ కాదు’’ అంటూ హిందీ సినిమాల గురించి గొప్పగా మాట్లాడాడు నాని (Nani). అంతే కాకుండా సల్మాన్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Also Read: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. ఏమన్నారంటే.?

సూపర్ స్టార్ ఎలా అయ్యావు.?

‘‘అక్కడ సినిమాలు నడవవు అని సల్మాన్ ఈజీగా అనేశారు. అలా నడవకపోతే ఆయన సూపర్ స్టార్ ఎలా అయ్యారు? ఇక్కడ కూడా ఆయన సినిమాలు నడుస్తాయి. పైగా అందరూ ఆయనను ప్రేమిస్తారు. సల్మాన్ నటించిన ఎన్నో సినిమాలు మేము చూశాం’’ అంటూ తన సినిమాలను గుర్తుచేసుకున్నాడు నాని. మొత్తానికి సల్మాన్ ఖాన్ సౌత్ ఆడియన్స్ గురించి నెగిటివ్‌గా మాట్లాడినా నాని మాత్రం కూల్‌గానే రియాక్ట్ అయ్యాడు. సల్మాన్ మాటలను తాను తప్పుగా తీసుకోలేదని, ఎవరూ కూడా అలా తీసుకోకూడదని అన్నాడు. ఇక నాని, శైలేష్ కొలను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హిట్ 3’ మే 1న విడుదలకు సిద్ధమయ్యింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×