Hit 3 Trailer Lunch Event : నాచురల్ స్టార్ నాని గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలు పెట్టిన నాని అష్టా చమ్మా సినిమాతో నటుడుగా అడుగులు వేశాడు. ఆ తర్వాత కథానాయకుడుగా ఎదిగి చాలామంది దర్శకులను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. జెర్సీ సినిమా తర్వాత నాని కథలను ఎన్నుకునే విధానం కంప్లీట్ గా మారిపోయింది. ఇప్పుడు నాని నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే ఎంతో క్యూరియాసిటీతో ఆడియన్స్ థియేటర్కు వెళ్లడం మొదలుపెట్టారు. తన కెరియర్ లో అన్ని క్వాలిటీ సినిమాలు ఎంచుకుంటున్నాడు నాని. ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమా హిట్ 3. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఆసక్తికరంగా ఉంది. హిట్ 3 సినిమాతో హిట్టు కల కనిపిస్తుంది.
అమ్మాయి కోసం వైజాగ్
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్లో నాని మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు. దాదాపు 15 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి కోసం నేను వైజాగ్ వచ్చేవాడిని. ఆ తర్వాత ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను అంటూ తన భార్య గురించి చెప్పారు. 15 సంవత్సరాల నుండి కేవలం మీ కోసమే వస్తున్నాను అంటూ ఆడియన్స్ను ఉద్దేశించి తెలిపాడు నాని. అప్పుడు ప్రేమ కోసమే వచ్చాను ఇప్పుడు ప్రేమ కోసమే వస్తున్నాను అంటూ మాట్లాడారు. ఈ ట్రైలర్ను అందరికంటే మీరే ముందు చూసారు అన్ని చోట్ల కంటే ఇక్కడే ఎక్కువ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలి అంటూ తెలిపాడు నాని.
Also Read : Hit 3 trailer review : అర్జున్ సర్కార్ గా నాని అరాచకం
యాక్షన్ హీరో కావాలా.?
ఇక ట్రైలర్ గురించి నాని మాట్లాడుతూ నేను యాక్షన్ సినిమా చేస్తే చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. వాళ్లందరూ కూడా మే ఫస్ట్ నా థియేటర్ కు వచ్చేయండి. నాని సాఫ్ట్ సినిమా చేస్తే చూడాలి అనుకునే వాళ్ళు మే ఫస్ట్ నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాని ఏం చేసినా నచ్చుతుంది అని అనుకునేవాళ్లు కూడా మే ఫస్ట్ ను థియేటర్కు వచ్చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. “మనుషుల మధ్యన ఉంటే అర్జున్, మృగాల మధ్యన ఉంటే సర్కార్, అదే వైజాగ్ లో ఫ్యాన్స్ మధ్యన ఉంటే అల్లుడు అంటూ చెప్పుకొచ్చాడు” నాని మాట్లాడిన తర్వాత అభిమానులందరితో సెల్ఫీ దిగాడు. ఇదేమైనా ఈ సినిమా ట్రైలర్ చెప్పిన టైంకి రాకపోయినా కూడా వచ్చిన టైం కు మాత్రం అందర్నీ సప్రైజ్ చేసింది అని మరోసారి గుర్తు చేసుకోవాలి.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌ను కాపీ కొట్టిన కోలీవుడ్ స్టార్… రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయాడుగా…