BigTV English

HIT 3 : నాని స్కెచ్ అదుర్స్.. ఈసారి రంగంలోకి విలక్షణ నటుడు

HIT 3 : నాని స్కెచ్ అదుర్స్.. ఈసారి రంగంలోకి విలక్షణ నటుడు

HIT 3: నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో. ఈయ‌న క‌థానాయ‌కుడిగానే కాదండోయ్‌.. నిర్మాత‌గానూ త‌న మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. వాల్‌పోస్ట‌ర్ సినిమా అనే బ్యాన‌ర్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన అ!, హిట్ చిత్రాలు రెండు ఘ‌న విజ‌యాల‌ను సాధించాయి. ఇప్పుడు హిట్ 2ను డిసెంబ‌ర్ 2న తీసుకొస్తున్నారు నిర్మాత నాని. ఈ సినిమా రిలీజ్ కాక మునుపే ఆయ‌న మ‌రో సినిమాకు అదిరిపోయే స్కెచ్ వేసుకున్నారు. ఇంత‌కీ ఆ సినిమా ఏంటో తెలుసా! హిట్ 3. హిట్ మూవీ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ ఇది.


హిట్ మూవీలో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించారు. హిట్ 2లో అడివి శేష్ హీరోగా న‌టించారు. దీంతో హిట్ 3లో హీరోగా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు హిట్ 3లోనూ అడివి శేష్ హీరోగా న‌టించబోతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌య‌మేమంటే.. హిట్ 3లో విల‌న్‌గా విల‌క్ష‌ణ న‌టుడు.. మ‌క్క‌ల్ సెల్వ‌న్ క‌నిపించ‌బోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే క‌నుక నిజ‌మైతే, నిర్మాత‌గా నాని స్కెచ్ అదిరిపోయింద‌ని మీడియా వ‌ర్గాలు అంటున్నాయి. అడివి శేష్‌తో పాటు విజ‌య్ సేతుప‌తి యాడ్ అయితే సినిమా క్రేజ్ పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రి హిట్ 3 ఎప్పుడు సెట్స్‌పై వెళుతుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.


    Related News

    Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

    Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

    Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

    Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

    The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

    Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

    Big Stories

    ×