Nani : నాని ప్రస్తుతం హిట్ 3 సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనికి ముందు వచ్చిన రెండు సినిమాలు హిట్ కావడంతో ఈ సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. ఈ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు నాని. అయితే కేవలం తెలుగు ప్రేక్షకులు తో మాత్రమే కాకుండా, తమిళ్ మలయాళం ప్రేక్షకులు తో కూడా కనెక్ట్ అవుతున్నాడు. అయితే ఈ తరుణంలో ఒక కేరళ అభిమాని ప్రెస్ మీట్ తన గురించి ఇంట్రడక్షన్ చేసుకుంటూ తన కథ వింటారా అని నానిను అడిగాడు. ఖచ్చితంగా వింటాను సినాప్సిస్ ఉందా అని నాని అడిగాడు.
స్టేజ్ పైన మాటిచ్చాడు
ఇక నాని ఆ వ్యక్తిని పిలిచి తనతో కాసేపు మాట్లాడి తన చేతిలో ఉన్న సినాప్సిస్ తీసుకున్నాడు. అలానే దానిపైన తన కాంటాక్ట్ నెంబర్ తో పాటు, తాను ఇదివరకే చేసిన షార్ట్ ఫిలిం లింకు కూడా పెట్టాడు. నాని ఆరోజు స్టేజ్ పైన మాట్లాడుతూ ఖచ్చితంగా నేను ఈ రోజే దీనిని చదువుతాను. మీకు అప్డేట్ ఇస్తాను. ఇది నేను నీకోసం చేయట్లేదు నాకోసం చేసుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ నీకు మంచి ఫ్యూచర్ ఉండాలి అని అనుకుంటున్నాను అని నాని తనను ఆరోజు స్టేజ్ పైన హాగ్ చేసుకున్నాడు. ఒకవేళ నేను కాకపోయినా కూడా వేరే ఎవరితో అయినా నువ్వు సినిమా చేసి మంచి స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : Victory Venkatesh : ఇమీడియట్ గా త్రివిక్రమ్ కి ఫోన్ చేసి చెప్పండి
సినాప్సిస్ చదివాడు
ఇక నాని ఆ అబ్బాయి అందించిన సినాప్సిస్ చదివి తన సిస్టర్ కు పంపించాడు. తన సిస్టర్ ని కూడా చూడమని చెప్పాడు. అంతేకాకుండా తాను చేసిన షార్ట్ ఫిలిం కూడా చూడమని సజెస్ట్ చేశాడు. అయితే షార్ట్ ఫిలిం తాను చూసానని చాలా ప్రామిసింగ్ గా అనిపించింది అని నాని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. త్వరలో ఆ అబ్బాయికి కబురు పెట్టబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి మరో కేరళ అబ్బాయిని కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పని చేయనున్నాడు నాని అని అర్థమవుతుంది. ఏదేమైనా నిజంగా టాలెంట్ ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి నాని రెడీగా ఉంటాడు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.