BigTV English

Penguin Viral News: ఏటా 5 వేల మైళ్లు ప్రయాణం చేసి మరీ అతడిని కలుస్తున్న పెంగ్విన్.. ఎందుకంటే?

Penguin Viral News: ఏటా 5 వేల మైళ్లు ప్రయాణం చేసి మరీ అతడిని కలుస్తున్న పెంగ్విన్.. ఎందుకంటే?

ప్రకృతిలో ఎన్నో విశ్వాసం గల జీవులు ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి పెంగ్విన్. ఆపదలో ఉన్న తనను కాపాడి, ప్రాణాలు నిలబెట్టిన మిత్రుడిని కలిసేందుకు ప్రతి ఏటా 5 వేల మైళ్ల ప్రయాణం చేస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. ఇంతకీ ఆ పెంగ్విన్ కథ ఏంటి? అతడిని 5 వేల మైళ్లు ప్రయాణించి ఎందుకు కలుస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


2011లో పెంగ్విన్ ప్రాణాలు కాపాడిన జాలరి

2011లో బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరో సమీపంలోని బీచ్‌లో జోవో అనే ఓ జాలరి చేపలు పడుతున్నాడు. ఆ సమయంలో సముద్రపు ఒడ్డున ఓ పెంగ్విన్ చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ కనిపించింది. ఆ పెంగ్విన్ చుట్టూ నల్లటి నూనెతో కప్పబడి ఉంది. జోవో దాన్ని చూసి బాధపడ్డాడు. తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. దానిని చక్కగా స్నానం చేయించాడు. దానికి డిండిమ్ అని పేరు పెట్టాడు. దానికి కొద్ది రోజుల పాటు ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. చక్కగా చేపలు పెట్టి పెంచాడు. కొద్ది రోజుల్లోనే ఆరోగ్యంగా మారింది. బలంగా తయారైంది. డిండిమ్ పూర్తిగా కోలుకుంది. జోవో దాన్ని తిరిగి బీచ్ కు తీసుకొచ్చాడు. సముద్రంలో ఈత కొట్టేలా చేశాడు. ఆ తర్వాత సముద్రంలో వదిలేశాడు. ఇక డిండిమ్ శాశ్వతంగా తన నుంచి వెళ్లిపోతుందని జోవో భావించాడు.


ఏడాది తర్వాత మళ్లీ అదే బీచ్ లో ప్రత్యక్షం 

సరిగ్గా ఏడాది ఎవ్వరూ ఊహించని విధంగా డిండిమ్ మళ్లీ అదే బీచ్ లో ప్రత్యక్షం అయ్యింది. జోవో డిండిమ్ ను చూసి షాకయ్యాడు. ఏడాది తర్వాత వచ్చిన ఫ్రెండ్ ను చూసి పట్టలేనంత సంతోషానికి గురయ్యాడు. అప్పటి నుండి, ప్రతి సంవత్సరం, డిండిమ్ తన స్నేహితుడిని చూడటానికి పటగోనియా నుండి 5,000 మైళ్లు ఈదుకుంటూ వస్తుంది. వచ్చి కొద్ది నెలల పాటు ఎంజాయ్ చేస్తుంది. అతడి ఇంటి దగ్గర ఎంజాయ్ చేస్తుంది.  ఆ తర్వాత మళ్లీ డిండిమ్ సముద్రంలోకి వెళ్లిపోతుంది.

ఆశ్చర్యకరం అంటున్న పరిశోధకులు

డిండిమ్ లాంటి జీవులు ఇలా ప్రతిఏటా వచ్చిన తనను కాపాడిన వ్యక్తితో సమయం గడిపి వెళ్లడం నిజంగా ఆశ్చర్యం అంటున్నారు పరిశోధకులు. డిండిమ్ మాత్రం తన ప్రాణాలను కాపాడిన జోవోను మర్చిపోకపోవడం నిజంగా అద్భుతం అంటున్నారు. ఆయతో గడిపేందుకు ఎక్కడుకున్నా ఏడాదికి ఓసారి వస్తుందని చెప్తున్నారు. ఈ రకమైన బంధం నిజంగా అద్భుతం అంటున్నారు.

డిండిమ్ ప్రేమకు ప్రపంచం ఫిదా

డిండిమ్ కథ ప్రపంచ వ్యాప్తంగా  అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. జంతువులు తమకు సహాయం చేసే వ్యక్తులతో ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉంటాయనే దానికి ఇదో నిదర్శనం అంటున్నారు. డిండిమ్‌ను కాపాడినప్పుడు జోవో పెంగ్విన్ స్నేహితుడిని చేసుకుంటాడని ఊహించలేదు. కానీ, ఇప్పుడు వారిద్దరి స్నేహం విశ్వవ్యాప్తం అయ్యింది. దయతో ఉండటం వల్ల పెంగ్విన్ కు, ఓ వ్యక్తికి మధ్య అద్భుతమై స్నేహాలు ఏర్పడుతాయని రుజువు చేస్తుంది.

Read Also: పామును మెడలో వేసుకుని.. బీరు తాగిస్తూ.. మందుబాబు వీరంగం!

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×