Narivetta Trailer: టోవినో థామస్(Tovino Thamas) ప్రధాన పాత్రలో అనురాజ్ మనోహర్ (Anuraj Manohar)దర్శకత్వంలో తెరికెక్కిన చిత్రం నరివెట్ట(Narivetta). కేరళలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ మలయాళ చిత్రం ఇప్పటికే అక్కడ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల వ్యవధిలోనే ఏకంగా 8 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సంచలనాలను సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. కేరళలో జరిగిన ఒక వాస్తవ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
వాస్తవ సంఘటన ఆధారంగా….
ఇక మలయాళంలో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమాని తెలుగులో మే 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా నుంచి తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ ను ఎంతో అద్భుతంగా కట్ చేశారు. అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులను అక్కడి నుంచి తరిమేసే నేపథ్యంలో గిరిజనులు పోలీసుల మధ్య ఎన్కౌంటర్ జరిగిన దృశ్యాలను చూయించారు. ట్రైలర్‌లో నాటి నర మేథం దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూయించడంతో సినిమా చూసిన వారంతా తీవ్ర భావోద్వేగాలకులోనయ్యారు
మైత్రి మూవీ మేకర్స్…
2003వ సంవత్సరంలో కేరలలోని ముత్తంగ అనే ప్రాంతంలో పోలీసులు దాడి చేసిన ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని అనురాజ్ మనోహర్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు (Suraj Venjaramoodu), ప్రియంవద కృష్ణన్ (Priyamvada Krishnan) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇలా మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
ఇటీవల కాలంలో ఒక భాషలో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలను వెంటనే ఇతర భాషలలోకి కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా డబ్బింగ్ సినిమాల ద్వారా ఇతర భాష హీరోలు కూడా ప్రస్తుతం తెలుగులో ఎంతోమంది ఆదరణ సొంతం చేసుకుంటూ ఏకంగా తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల బిజీ అయ్యారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో నటుడు దుల్కర్ సల్మాన్, పృధ్వీరాజ్ సుకుమారన్ వంటివారు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇక ఈ హీరోల తరహాలోనే ఈ సినిమా ద్వారా టోవినో థామస్ సైతం తెలుగులో మంచి సక్సెస్ అందుకుంటారని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాని తెలుగులో విడుదల చేయబోతున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు కూడా ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని చూడటం కోసం ఎదురుచూస్తున్నారు. మరి తెలుగులో ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ దక్కుతుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది.