BigTV English

Trump : అమెరికా కోర్టులో ఇండియా, పాక్ వార్.. ట్రంప్‌ మామూలోడు కాదు..!

Trump : అమెరికా కోర్టులో ఇండియా, పాక్ వార్.. ట్రంప్‌ మామూలోడు కాదు..!
Advertisement

Trump : ట్రంప్‌తో మామూలుగా ఉండదు..! సొంత డబ్బా కొట్టుకోవడంలో ఆయన్ని మించినోడు ఎవరూ ఉండరేమో..! ఇండియా-పాక్‌ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్‌.. చివరికి కోర్టులోనూ అదే సోది కంటిన్యూ చేశాడు. టారిఫ్‌ వార్‌పై విచారణ సమయంలో పాక్‌-భారత్‌ ఇష్యూను ప్రస్తావించి బొక్కబోర్లా పడ్డారు.


టారిఫ్‌లు ఆపితే.. మళ్లీ వార్

టారిఫ్‌ వార్‌పై అమెరికా ట్రేడ్‌ కోర్టులో విచారణ జరిగింది. మొదట ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ వాదనలు వినిపించింది. అధ్యక్షుడి టారిఫ్‌ అధికారాలను సమర్థించాలని కోర్టును అభ్యర్థించింది. టారిఫ్‌ అధికారాలను నిలిపివేస్తే.. చైనాతో వాణిజ్య సంధిని మార్చేస్తుందని.. భారత్‌-పాక్‌ మధ్య మళ్లీ ఘర్షణలను పెంచుతుందని వాదించింది. టారిఫ్‌ అధికారం వల్లే ఇటీవల ఇండియా, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్‌ కుదిర్చారని వివరించింది.


కోర్టులో ట్రంప్‌కు షాక్

టారిఫ్‌ వార్‌పై ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది ట్రంప్‌ టీమ్. ఈ ట్రేడ్‌ డీల్స్‌ను ఖరారు చేసేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు సున్నితమైన అంశంగా పరిగణించాలని రిక్వెస్ట్ చేసింది. అయితే ట్రంప్‌ అడ్మిస్ట్రేషన్‌ చేసిన అన్ని వాదనలను రిజెక్ట్ చేసింది కోర్టు.

ఆ అధికారం కాంగ్రెస్‌కే..

అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి.. యూఎస్ కాంగ్రెస్‌ అపరిమిత అధికారాలను ఇవ్వలేదని తేల్చి చెప్పింది కోర్టు. ఇతర దేశాలతో వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని తెల్పింది. దీన్ని అధ్యక్షుడి విచక్షణాధికారాలతో అధిగమించలేరని స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ వ్యవస్థలను బలహీన పరచడమే అవుతుందని తెల్పింది కోర్టు.

ట్రంప్ టారిఫ్‌లకు కోర్టు బ్రేక్

లిబరేషన్‌ డే పేరుతో.. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌లకు కోర్టు బ్రేక్‌ వేసింది. ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే విదేశాలపై ప్రెసిడెంట్‌కు ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది. ఇటీవల ట్రంప్‌ ప్రకటించిన టారిఫ్‌లను నిలిపి వేస్తూ యూఎస్‌ ట్రేడ్ కోర్టు తీర్పు ఇచ్చింది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కేవలం కాంగ్రెస్‌కే ఉందని స్పష్టం చేసింది. విశేష అధికారాలతో టారిఫ్‌లు విధించడం సరికాదని.. అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై ట్రంప్‌ సర్కారు వెంటనే అప్పీల్‌ దాఖలు చేసింది.

Related News

No Kings Protests: అమెరికా వీధుల్లోకి లక్షలాది మంది.. ట్రంప్ నకు వ్యతిరేకంగా నో కింగ్స్ ఆందోళనలు

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో తల్లీకూతుళ్లు మృతి, పలువురికి గాయాలు

Trump on AFG vs PAK: పాక్-ఆఫ్ఘన్ యుద్ధం ఆపడం నాకు చాలా ఈజీ.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట

Donald Trump: పాక్ డబ్బులకు ఆశపడి.. ట్రంప్ ఇండియా-అమెరికా సంబంధాలు దెబ్బతీశాడా?

Pak Defense Minister: తాలిబన్ల దాడి.. ఇండియా పనే, పాక్ రక్షణ మంత్రి దొంగ ఏడుపులు.. ఖండించిన భారత్

Afghan Pak Clash: పాకీ సైనికుడి ప్యాంటును వీధుల్లో ఊరేగించిన తాలిబన్లు, ఇదెక్కడి మాస్ రా!

Austria News: ఆపరేషన్ రూమ్‌లో 12 ఏళ్ల బాలికతో.. రోగి మెదడకు రంధ్రం పెట్టించిన సర్జన్, చివరికి..?

Pakistan – Afghanistan: పాక్- అఫ్ఘాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. తాలిబన్ల దాడుల్లో పాక్ సైనికుల మృతి

Big Stories

×