Narne Nithin: శ్రీ విష్ణు హీరోగా కేతిక ఇవానా హీరోయిన్స్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ తో సింగిల్ మూవీ మే 9ను ప్రేక్షకులు ముందుకు రానుంది. ముఖ్యపాత్రలో సునీల్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మూవీ టీం ప్రమోషన్స్ లో పాల్గొంది. అందులో భాగంగా తాజాగా జరిగిన ఈవెంట్ లో ముఖ్య అతిథులుగా, అల్లు అరవింద్ అల్లు శిరీష్ నార్నీ నితిన్ విచ్చేశారు. అందులో భాగంగా నార్ని నితిన్ తన బావ జూనియర్ ఎన్టీఆర్ డైలాగుని చెప్పడంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బావ డైలాగ్ ని రీక్రియేట్ చేసిన బామ్మర్ది..
యంగ్ హీరో శ్రీ విష్ణు, హీరోగా నటిస్తున్న చిత్రం. ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులు ముందుకు రానుంది. తాజాగా జరిగిన ఈవెంట్ నార్నీ నితిన్ పాల్గొన్నారు. సుమ యాంకరింగ్ తో ఈవెంట్ నిర్వహించారు. సుమ ఈవెంట్ లో అందరితో డాన్స్ చేయాలని చెప్పడంతో, నార్నీ నితిన్ ను పిలుస్తారు. సినిమా గురించి మాట్లాడుతూ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని సింగిల్ గా లైఫ్ నీ లీడ్ చేయడం బాగుంటుందని, ఆయన తెలుపుతూ, అందరూ ఎన్టీఆర్ డైలాగులు చెప్పమనడంతో, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగ్ చెప్పి తొడ కొట్టడంతో అందరూ చప్పట్లు కొడతారు. ఈ వీడియో చూసిన వారంతా తన బావపై నార్ని నితిన్ చూపే అభిమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మాడ్ స్క్వేర్ తో సక్సెస్ ని అందుకున్నారు.ఈ మూవీ ప్రమోషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి అలరించడం మనం చూశాం.
మూవీ ప్రమోషన్స్ …ఫన్ బ్లాస్ట్ ..
ఇక ఈ ఫన్ బ్లాస్ట్ లో సుమ అందరితో స్కిట్స్ చేయించింది. అల్లు అరవింద్ తన కొడుకు అల్లు శిరీష్ పెళ్లి గురించి మాట్లాడడం, అల్లు శిరీష్ సింగిల్ గా ఉండడమే బాగుంటుందని చెప్పడం విశేషం. సింగిల్ సినిమాలో రాహుల్ సిప్లిగంజి పాడిన పాట అందరినీ అలరిస్తోంది. ఈ పాట సింగిల్ గా ఉండడం బాగుంటుందని మీరెలా చెప్పారు అని సుమా అడగడంతో, శ్రీ విష్ణు మాట్లాడుతూ.. సింగిల్ గా ఉన్నప్పుడే బాగుంటుంది మింగిల్ అయిన తర్వాత పడే కష్టాలు అప్పుడే తెలుస్తాయి అని అంటాడు. అదే పాటలో చూపించాము అని రాహుల్ తెలుపుతాడు. అయ్ అనే మూవీతో గీతా ఆర్ట్స్ లో నార్నీ నితిన్ బ్లాక్ బాస్టర్ ని అందుకున్నారు. మొదటి సినిమాగా వచ్చిన ఈ మూవీ ఎంతో సక్సెస్ ని సాధించింది. ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్ గా నటించారు. ఆ తరువాత 2003లో మ్యాడ్ సినిమాతో కళ్యాణ్ శంకర్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దానికి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో నార్నీ నితిన్ తో పాటు సంగీత్ శోభన్ రామ్ నితిన్ ప్రధానోపాత్రలో నటించారు.ఇక సింగిల్ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్,చౌదరి నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ తో అభిమానులలో అంచనాలను పెంచేసింది.
Narne Nithin has recreated #JrNTR’s famous "Amma Thodu" dialogue from the movie #Aadi!! pic.twitter.com/wjq8b8g0tZ
— Movies4u Official (@Movies4u_Officl) May 8, 2025