BigTV English

Nani : తెలుగు సినిమాకి నాని అసలైన ‘గేమ్ ఛేంజర్’

Nani : తెలుగు సినిమాకి నాని అసలైన ‘గేమ్ ఛేంజర్’

Nani : నాని ఏంటి? ‘గేమ్ ఛేంజర్’ ఏంటి? అది రాంచరణ్ టైటిల్ కదా? అని కన్ఫ్యూజ్ అవుతున్నారా?అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది ‘గేమ్ ఛేంజర్’ గురించి.. దాని రిజల్ట్ గురించి కాదు. తెలుగు సినిమాకి నాని ఒక గేమ్ ఛేంజర్ ఎందుకయ్యాడు అనే దాని గురించి.


అసలు విషయంలోకి వెళితే.. తెలుగులో ప్రయోగాత్మక సినిమాలు వర్కౌట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఒకప్పుడు అలాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పటికి వాటిని క్లాసిక్స్ గా జస్ట్ నోటి మాటలతో చెప్పుకుంటున్నాం.. కానీ ఆ టైంలో ఆ సినిమాలు నిర్మాతలకి బయ్యర్స్ కి ఎంతవరకు మిగిల్చాయి. థియేటర్లలో ఎన్ని రోజులు ఆడాయి వంటి వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే.. ఆ క్లాసిక్ సినిమాలు బయ్యర్లకి, నిర్మాతలకి మిగిల్చింది ఏమీ లేదు. వాటి వల్ల వాళ్ళు నష్టపోయారు. మేకర్స్ మాత్రం వాటిని అవార్డ్స్ కోసం ప్రమోట్ చేసి.. అవార్డులు తెచ్చుకుని శాటిలైట్ బిజినెస్ చేసుకున్నారు. వాస్తవం అయితే ఇదే.

అంతేకాదు పెద్ద హీరోలు ప్రయోగాత్మక సినిమాలు చేస్తే.. తెలుగు ప్రేక్షకులు కనీసం వాటిని పట్టించుకోరు అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. చాలా సందర్భాల్లో అది నిజమని ప్రూవ్ అయ్యింది కూడా..! ఉదాహరణకి ఇటీవల వచ్చిన ‘ఛావా’ నే చూసుకోండి. ఆ సినిమా తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాకముందే తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో ఎగబడి చూశారు. మరాఠీలో గొప్పవాడు అయినటువంటి ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శంభాజీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నారు.


కానీ మన తెలుగులో మొదటి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి గొప్పగా చెబుతూ ‘సైరా నరసింహారెడ్డి’ చేస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ సినిమా నిర్మాత రాంచరణ్ కి ఫైనల్ గా ఆ సినిమా నష్టాలే మిగిల్చింది. ఎందుకంటే ఆ సినిమాలో చిరంజీవి వంటి స్టార్ హీరో పాత్ర తలని నరకడం వంటివి ఫ్యాన్స్ కానీ, ఆడియన్స్ కానీ యాక్సెప్ట్ చేయలేదు. ‘ఛావా’ లాంటి సినిమాలో అయితే హీరోతో సంబంధం లేకుండా కథతో ట్రావెల్ అయ్యారు. సో స్టార్స్ ప్రయోగాత్మక సినిమాల్లో నటించకూడదు అని ఆడియన్స్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు.

కానీ ప్రయోగాలకి కూడా కరెక్ట్ కాలుక్యులేషన్స్ వేసుకుంటే హిట్లు కొట్టొచ్చని నాని ప్రూవ్ చేస్తున్నాడు. క్లాస్ సినిమా తీసినా, మాస్ సినిమా తీసినా నాని సినిమాలు ఆడుతున్నాయి. నిర్మాతగా అయితే నాని సూపర్ ఫామ్లో ఉన్నాడు. ‘అ!’ ‘హిట్’ ‘హిట్ 2’ ఇప్పుడు ‘కోర్ట్’ తో వరుస హిట్లు ఇచ్చాడు నాని. హీరోగా ఎలా ఉన్నా.. నిర్మాతగా నాని చేసినవి అన్నీ కొత్త ప్రయత్నాలే. అందరూ కొత్త దర్శకులే. క్వాలిటీ విషయంలో కూడా ఆ సినిమాల్లో ఏమీ తక్కువ అని అనిపించదు.

‘కోర్ట్’ అనే సినిమాని రూ.6 కోట్లలో కంప్లీట్ చేశాడు నాని. సినిమా వర్కింగ్ డేస్ కూడా నెల రోజులకి మించలేదు. తక్కువ టైంలో, తక్కువ బడ్జెట్లో క్వాలిటీ సినిమాలు ఎలా నిర్మించాలి? ఎలా మార్కెటింగ్ చేయాలి? అనే ప్రశ్నలకి తాను నిర్మించే సినిమాలతో కొత్త డిఫినిషన్లు చెబుతున్నాడు నాని. అలా అతను తెలుగు సినిమాకి ఒక ‘గేమ్ ఛేంజర్’ అని అనిపించుకుంటున్నాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×