
Nayanthara : సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందడంతో పాటు అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్స్ లో నయనతార ఒకరు. తమిళ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతల, దర్శకుల ఫస్ట్ ఛాయిస్ నయనతార అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అందుకే ఈ బ్యూటీ తన రెమ్యూనరేషన్ ని ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తోంది. దీనికి తోడు నయనతార నటించిన బాలీవుడ్ జవాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు క్రేజ్ మరింత పెరిగింది. పైగా నయనతార హీరోయిన్ అంటే హీరోకి ఏమాత్రం తీసిపోకుండా నటిస్తుంది అన్న పేరు కూడా ఇండస్ట్రీలో బలంగా ఉంది.
కమల్ హాసన్ కెరియర్‌ను పీక్స్ కి తీసుకువెళ్లిన మూవీ నాయకుడు. ఆ మూవీ వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కమల్ ,మణిరత్నం కాంబోలో మరొక మూవీ రాబోతోంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం నయనతారను అప్రోచ్ అవ్వడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కోసం నయన్ ఏకంగా 12 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. జవాన్ సినిమాకి ఆమె అందుకున్న రెమ్యూనరేషన్ 10 కోట్లు.. దానికే అందరూ ఆశ్చర్యపోయారు మరి ఇప్పుడు ఏకంగా రెండు కోట్లు పెంచి మరీ అడుగుతోంది.
కమల్ ,మణిరత్నం కాంబోలో రాబోతున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూవీలో హీరోయిన్ కోసం మొదట్లో ఐశ్వర్యరాయ్ లేక త్రిష పేర్లు పరిగణిస్తున్నట్లు టాక్ వచ్చింది. రీసెంట్గా ఈ జాబితాలో నయనతార పేరు కూడా చేరిపోయింది. ఇప్పటివరకు మణిరత్నం డైరెక్షన్లో నయనతారను చూసింది లేదు.. రావణన్ మూవీలో విక్రమ్ సిస్టర్ క్యారెక్టర్ కోసం మణిరత్నం.. నయనతార కోసం ప్రయత్నించినా అప్పట్లో కుదరలేదు. చివరికి ఆ పాత్రకు ప్రియమణి సెట్ అయింది. మరోపక్క నయనతార ఇప్పటివరకు కమల్ హాసన్ పక్కన హీరోయిన్ గా చేసింది లేదు.ఈ నేపథ్యంలో ఈ క్రేజీ కాంబో పై అందరి దృష్టి ఉంది. మరి ఈ కాంబో ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి.
Byreddy: రంగం సినిమాలో విలన్ లా పవన్.. బైరెడ్డి ఆన్ ఫైర్.. జనసైన్యం అటాక్