
Prithvi Raj Singh Oberoi : ఒబెరాయ్ గ్రూప్ ఎమెరిటస్ ఛైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ కన్నుమూశారు భారతదేశంలోని హోటల్స్ వ్యాపార ముఖచిత్రాన్ని మార్చిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి చెందారు. అనేక దేశాల్లో లగ్జరీ హోటళ్లు నిర్వహిస్తూ వ్యాపారాన్ని విస్తరించారు. ఒబెరాయ్ హోటల్స్ , రిసార్ట్స్ అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించారు.
అలా ఆ సంస్థను అభివృద్ధిలోకి తీసుకెళ్లడంలో ఒబెరాయ్ కీలక పాత్ర పోషించారు. ఒబెరాయ్ బ్రాండ్ లగ్జరీ హోటళ్లకు కెరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ముఖ్యమైన నగరాల్లో అనేక లగ్జరీ హోటళ్లను ప్రారంభించారు. అంతర్జాతీయ లగ్జరీ ట్రావెలర్స్ మ్యాప్‌లో ఒబెరాయ్ హోటళ్లను ఉంచిన ఘనత పృథ్వీరాజ్ సింగ్ ఒబెరాయ్ కే దక్కుతుంది.
ఒబెరాయ్ 2008లో భారత్ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. ఇంటర్నేషనల్ లగ్జరీ ట్రావెల్ మార్కెట్ 2012 డిసెంబర్ లో అతనికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందించింది. అతని అసాధారణ నాయకత్వం, దూరదృష్టి, కృషికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఒబెరాయ్ గ్రూప్ ప్రపంచంలోని ప్రముఖ లగ్జరీ హోటల్ చైన్‌లలో ఒకటిగా నిలిచింది.
HOTELS మ్యాగజైన్ PRS ఒబెరాయ్‌ను 150 కంటే ఎక్కువ దేశాల్లోని పాఠకుల ఓట్ల ద్వారా ‘2010 కార్పొరేట్ హోటలియర్ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తించింది. ఆ మ్యాగజైన్ నవంబర్ ఎడిషన్ కవర్ స్టోరీ లో ఆయనను భారతదేశంలో ఆధునిక లగ్జరీ హాస్పిటాలిటీ వ్యవస్థాపక పితామహుడుగా ప్రశంసించింది. కంపెనీని ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన లగ్జరీ హోటల్ గ్రూపులలో ఒకటిగా అభివృద్ధి చేశారని కీర్తించింది.