
Unstoppable With NBK : బాలయ్య క్రేజ్ ను డబుల్ చేసిన టాక్ షో ఆహా లో స్ట్రీమ్ అయ్యే అన్ స్టాపబుల్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇంతకుముందు బాలయ్య అంటే సరిపడని వారు కూడా ఎప్పుడెప్పుడు అన్ స్టాపబుల్ కొత్త ఎపిసోడ్ వస్తుందా అని వెయిట్ చేసే రేంజ్ లో బాలయ్య క్రేజ్ పెరిగిపోయింది. 2021,నవంబర్ 4 న నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా మొదలైన అన్ స్టాపబుల్ టాక్ షో పేరుకు తగినట్టుగానే అన్ స్టాపబుల్ గా కొనసాగుతోంది. ఇప్పటివరకు 550 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తన ఖాతాలో వేసుకొని ఈ షో దూసుకుపోతోంది.
ఇప్పటికి రెండు సీజన్ లు పూర్తి చేసుకొని ముచ్చటగా మూడో సీజన్ జరుపుకుంటుంది ఈ షో. మొదట సీజన్ కి ఎక్కువగా సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే దంచి కొట్టే రెస్పాన్స్ చూసి సెకండ్ సీజన్లో రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించారు. ఇలా ఒకవైపు సినీ సెలెబ్రిటీలు మరొకవైపు పొలిటికల్ లీడర్స్ కాంబినేషన్లో తిరుగులేని ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది ఈ షో. ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రాబోయే అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఎపిసోడ్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌భీర్ కపూర్ పాల్గొనబోతున్నారు అనేదే ఆ క్రేజీ అప్డేట్. బాలకృష్ణ తన రెగ్యులర్ సీరియస్ లుక్ ని పక్కన పెట్టి వచ్చిన గెస్ట్ లతో ఆడుతూ ,పాడుతూ..అవసరాన్ని బట్టి సెటైర్లు వేస్తూ.. గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. ఆద్యంతం వినోదాన్ని అందించే ఈ షో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందించడంతోపాటు రేటింగ్స్ పరంగా కూడా ఈ టాక్ షో టాప్ లో కొనసాగుతోంది.
ప్రస్తుతం రణబీర్ కపూర్, రష్మిక కాంబినేషన్ లో..సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో యానిమల్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతి త్వరలో బాలకృష్ణ టాక్ షోలో హీరో హీరోయిన్లతో పాటు డైరెక్టర్ కూడా సందడి చేయబోతున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతోంది అందుకని మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచేశారు. తెలుగులో బాగా ప్రమోట్ అవ్వాలి అనే ఉద్దేశంతో డైరెక్టర్..రణ్‌బీర్ కపూర్, రష్మిక తో పాటు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి రాబోతున్నట్లు టాక్. దీనికి సంబంధించిన ఇంట్రోను మేకర్ దీపావళి గిఫ్ట్ గా సోషల్ మీడియాలో బాలీవుడ్ మీట్స్ బాలయ్య అనే క్యాప్షన్ తో వీడియోను విడుదల చేశారు.