Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) కండీషన్స్ కి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ప్రమోషన్స్ కి రాదు.. తను అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి.. పైగా తనకు సెట్ లో ఏ ఇబ్బందికరమైన సందర్భం ఎదురవకుండా చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో కండిషన్స్ పెట్టి, ఆ కండిషన్స్ కి ఒప్పుకుంటేనే సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ కండిషన్స్ కి తగ్గట్టుగా తన నటనతో మెస్మరైజ్ చేస్తుంది అనుకోండి.
అందుకే అతి తక్కువ సమయంలోనే లేడీ సూపర్ స్టార్ గా ఎదిగి.. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా.. అదే స్టేటస్ను కొనసాగిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. తన అద్భుతమైన నటనతో, ముఖ కవళికలతో సౌత్ఆడియన్స్ హృదయాలను దోచుకున్న ఈమె.. ఈ మధ్య బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో తొలిసారి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్గా రికార్డు సృష్టించింది. ఒక్క సినిమాకు రూ.12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్స్ తో సమానంగా దూసుకుపోతోంది.
దెబ్బకు దిగివచ్చిన నయనతార..
అలాంటి నయనతార సడన్ గా చిరంజీవి 157 (Chiru 157) సినిమా కోసం పూర్తిగా తగ్గిపోయింది. ఎంతలా తగ్గింది అంటే రెమ్యూనరేషన్ సగానికి సగం తగ్గించుకోవడమే కాకుండా.. ప్రమోషనల్ వీడియో కూడా చేసి సర్ప్రైజ్ చేసింది. దీనితో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లేడీ సూపర్ స్టార్ ఏంటి ఇలా ప్రమోషన్స్ లో పాల్గొనడం ఏంటి? అందులోనూ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం ఏంటి? అంటూ ప్రతి ఒక్కరూ పలు రకాలుగా చెవులు కూడా కొరుక్కున్నారు. అయితే కొంతమంది అది అనిల్ రావిపూడి(Anil Ravipudi) స్ట్రాటజీ అని, అనిల్ రావిపూడి సలహా మేరకు నయనతార కాస్త దిగివచ్చిందని కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది లేదు లేదు మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం కారణంగానే ఆమె ఇలా తన రెమ్యూనరేషన్ ని తగ్గించుకొని ప్రమోషనల్ వీడియో చేసింది అని, ఇలా ఎవరికి వారు తమకు నచ్చినట్టు కామెంట్లు చేశారు. కానీ దీనికి గల సరైన కారణం మాత్రం తెలియలేదు. కానీ ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది.
ఆ భయం బాగానే చుట్టుకుందే..
అసలు విషయంలోకి వెళ్తే.. కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు పోతున్నట్టు ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు అడుగుపెడితే, పాత హీరోయిన్ లకి కాస్త హవా తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ హీరోయిన్లను పక్కనపెట్టి యంగ్ హీరోయిన్లకు దర్శక నిర్మాతలు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకవేళ ఇదే కొనసాగితే అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది అనే భయంతోనే నయనతార ఇలా ఒక మెట్టు కాదు ఏకంగా రెండు మెట్లు దిగినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పైగా కొత్త వాళ్లంతా అదనంగా ఎలాంటి పారితోషకం తీసుకోకుండానే దర్శక నిర్మాతలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటున్నారు. అటు హీరోయిన్ల మధ్య పరిస్థితులు కూడా మారిపోయాయి.. ఇలాంటి సమయంలో బెట్టు చేస్తే.. అవకాశాలపై ప్రభావం పడి , కెరియర్ దెబ్బ తినే అవకాశం ఉందని, అందుకే నయనతార దిగివచ్చినట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజము ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ మీడియాలో ప్రధమంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం.
also read:Sandeep Kishan: ప్రేమా లేదూ.. గీమా లేదు.. ఆ హీరోయిన్ తో పెళ్లిపై పక్కా క్లారిటీ..!