BigTV English
Advertisement

Maldakal Village: గాడిదను పూజించే గ్రామం.. తెలంగాణలో వింత ఆచారం..

Maldakal Village: గాడిదను పూజించే గ్రామం.. తెలంగాణలో వింత ఆచారం..

Maldakal Village: భారతీయ సంస్కృతికి నిలువుటద్దం తెలంగాణ రాష్ట్రం. ఇక్కడి గ్రామాలు ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు. ఇక్కడి ప్రతి గ్రామం మట్టి వాసనతో నిండి ఉంటుంది. ఏ గ్రామాన్ని చూసినా వింతలు, విశేషాలకు కొదువలేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకొనే గ్రామం గురించి తెలుసుకుంటే, ఔరా అనేస్తారు. కానీ ఇదొక వింత గ్రామమే అయినప్పటికీ, ఇక్కడి విశేషాలు తెలుసుకుంటే మన సంస్కృతికి పుట్టినిల్లు అనుకోవాల్సిందే. అయితే ఈ గ్రామం కాస్త భిన్నం.. ఎందుకో తెలుసుకోవాలంటే, పూర్తి కథనం చదవాల్సిందే.


ఈ గ్రామ వింతలు..
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న మాల్డాకల్ అనే గ్రామానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ దేవుడికి వాహనం గాడిదగా పూజించే గ్రామం మాత్రం మాల్డాకల్ ఒక్కటే. ఈ గ్రామంలో ఉండే శ్రీ తిమ్మప్ప స్వామి ఆలయం చుట్టూ అద్భుత విశ్వాసాలు, వింత సంప్రదాయాలు అలుముకున్నాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూడటానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.

దేవుడి వాహనం.. గాడిదే!
ఇక్కడ విశేషం ఏమిటంటే, శ్రీ తిమ్మప్ప స్వామికి వాహనంగా గాడిదను పూజిస్తారు. సాధారణంగా గాడిదను మనం నిర్లక్ష్యంగా చూస్తాం. కానీ మాల్డాకల్ గ్రామంలో గాడిదలకు దైవ గౌరవం ఉంది. గుడిలో ఉన్నప్పుడూ గాడిదలు స్వామివారికి ముందుగా మార్గం చూపుతూ ఊరేగింపులో పాల్గొంటాయి. అవి ఒక్కోసారి పూలతో అలంకరించి పల్లకీల ముందు నడిపిస్తారు. ఇది చూసినవారు ఆశ్చర్యపోతారు. అక్కడి ప్రజలు మాత్రం గాడిదల్ని దైవంతో సమానంగా చూస్తారు.


మూడు రాష్ట్రాల నుంచి భక్తుల రద్దీ
ఈ గ్రామం సరిహద్దులో ఉండటంతో కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి కూడా భక్తులు తరలివస్తారు. వారు తిమ్మప్ప స్వామిని దర్శించుకుని గాడిదలకు నైవేద్యం సమర్పిస్తారు. కొంతమంది గాడిదల చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు. కొన్ని కుటుంబాలు గాడిదలకే పాలాభిషేకం చేస్తూ, గుడి ముందు నిద్రపోతూ కోరికలు కోరుతారు.

ఊరంతా ఒక ఉత్సవం
ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు మాల్డాకల్ గ్రామాన్ని ఒక పండుగ ప్రదేశంగా మార్చేస్తాయి. ఊరంతా హోరాహోరీ సందడిగా మారుతుంది. పల్లకీల ఊరేగింపు, వాద్యాల నినాదాలు, కబడ్డీ పోటీలు, జానపద కళల ప్రదర్శనలు ఊరికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటన్నింటిలోనూ గాడిదలకు కేంద్ర స్థానమే. కొంతమంది తమ గాడిదలను స్వయంగా రంగు రంగుల వస్త్రాలతో అలంకరించి ఊరేగింపులో పాల్గొంటారు.

Also Read: Tamarind Leaves: మటన్ ధరను క్రాస్ చేసిన చింత చిగురు.. హైదరాబాద్‌లో ఇదేం రేటు గురూ!

అనాది కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం
ఇక్కడి పెద్దలు చెబుతున్న ప్రకారం, మాల్డాకల్ గ్రామం గాడిదలను పూజించే సంప్రదాయం అనాదిగా ఉంది. ఇది ఒక పరంపరగా వస్తోంది. తాతలు చేసిన విధంగానే మనవళ్లు కూడా చేస్తూ, సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆధునికత ఎంతైనా వచ్చినా, ఇక్కడి ప్రజలు తమ రూటే సపరేట్ అని నిరూపించుకుంటూ, తమ విధానం మార్చుకోకుండా నమ్మకంతో నడుస్తున్నారు.

ప్రకృతిలో ఆధ్యాత్మికత
మాల్డాకల్ చుట్టూ పచ్చటి పొలాలు, నదుల ప్రవాహం, ప్రకృతితో మమేకమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడికి వచ్చినవారికి ఒక భిన్నమైన అనుభూతి కలుగుతుంది. గొంతులో పాటలా, గుండెల్లో భక్తిలా.. ఇక్కడి గాలి మనసును తాకుతుంది. ఇది కేవలం ఒక ఊరు కాదు, ఇది ఆధ్యాత్మికత, భక్తి, సంప్రదాయం, ప్రకృతి అన్నిటి మిశ్రమమే.

వింత కాదు, విశ్వాసమే..
మాల్డాకల్ ఊరిని చూసినవారికి ఇది ఒక వింతగా అనిపించవచ్చు. గాడిదలను దేవతలుగా పూజించడం ఊహకు అందని విషయం అనిపించొచ్చు. కానీ ఇది ఆ గ్రామ ప్రజల జీవితభాగంగా, వారి విశ్వాసానికి కేంద్రబిందువుగా ఉంది. వాళ్లు గాడిదను చిన్నచూపు చూడరా అని కాదు, దేవుడికి నమ్మకంగా సేవ చేసే జీవిగా భావిస్తారు. ఈరోజుల్లో ఎంతో మంది తమ సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతున్నారు. కానీ మాల్డాకల్ గ్రామం మాత్రం అది తమకు జీవితం అని చాటుతోంది. ఇక్కడ గాడిదలు దేవతలు అవుతాయి.. ఆ నమ్మకం పండగగా మారుతుంది. మీరు భక్తుడైనా కాదన్నా సరే, ఒక్కసారి ఈ గ్రామానికి వెళితే, అక్కడి విశ్వాసం గుండెను తాకకుండా ఉండదు. ఇంతటి విశేషం గల గ్రామాన్ని ఓ సారి సందర్శించి అక్కడి వారితో మాట్లాడితే చాలు, మీలో భక్తి భావం కలగడం ఖాయం. మరెందుకు ఆలస్యం.. ఓసారి ఇటు వెళ్లి రండి!

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Big Stories

×