The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఈ ఏడాది కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్.. వచ్చే ఏడాది సమ్మర్ లో ది రాజా సాబ్ సినిమాతో సందడి చేయడానికి రెడీగా ఉన్నాడు. డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.
కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే అందాల భామలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. అంతేకాకుండా మొట్ట మొదటిసారి డార్లింగ్.. డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. తాతమనవడిగా ప్రభాస్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించనున్నాడు. ఇవన్నీ తెలిసాకా.. ఏ అభిమాని మాత్రం హైప్ పెంచుకోకుండా ఉంటాడు.
Best Horror Movies To Watch on Netflix : నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ హర్రర్ మూవీస్
డార్లింగ్ సినిమా అంటేనే ఒక పెద్ద హైప్ అనుకుంటే.. అందులో ఇంతమంది స్టార్ క్యాస్టింగ్ అంటే ఇక అంచనాలు ఆకాశాన్ని తాకేసాయి. అందులోనూ.. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మరొక విషయం ది రాజా సాబ్ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. దానికోసం మారుతీ.. లేడీ సూపర్ స్టార్ నయనతారను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.
ది రాజా సాబ్ సినిమాలో ఒక ప్రత్యేకమైన సాంగ్ లో ప్రభాస్ తో పాటు నయన్ చిందేయనున్నదట. ఇప్పటికే నయన్ తో మేకర్స్ సంప్రదింపులు కూడా జరిగాయని, ప్రభాస్ కోసం అమ్మడు డ్యాన్స్ చేయడానికి రెడీ అయ్యిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ – నయన్ కలిసి యోగి సినిమాలో నటించారు. అప్పట్లో ఆ సినిమా మంచి విజయాన్నే అందుకుంది.
RAPO22: క్లాస్ లుక్ లో రామ్ పోతినేని.. ఈసారి హిట్ ఖాయం
మొదట్లో కమర్షియల్ ఫిల్మ్స్ చేసిన నయన్.. కొద్దీ కొద్దిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఆమె ఎప్పుడు తెలుగు సినిమాలకు నో చెప్పింది లేదు. ప్రస్తుతం నయన్ ఒకపక్క హీరోయిన్ గా.. ఇంకోపక్క నిర్మాతగా బిజీగా మారింది. ఈ సమయంలో కూడా ఒక స్పెషల్ సాంగ్ కోసం నయన్ ఒప్పుకుంది అంటే.. అది కేవలం ప్రభాస్ కోసమే అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ నెలాఖరున ఈ సాంగ్ షూట్ ఉండబోతుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే కనుక నిజమైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇప్పటివరకు యాక్షన్ సినిమాలతో దుమ్ము దులిపిన ప్రభాస్.. కొద్దిగా చేంజ్ కోసం ది రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఇందులో డార్లింగ్ కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అంటున్నారు. గత కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న మారుతీ.. ప్రభాస్ ను కథతో ఒప్పించి ఈ సినిమాను పట్టాలెక్కించాడు. ఇందులో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడు అని తెలియడంతో ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.