Vijay Devarakonda vs Nani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం అన్నది కామన్. నిజానికి ఇండస్ట్రీలోని స్టార్ హీరోల మధ్య హెల్దీ పోటీ ఉంటుంది. హీరోలు కూడా బాక్స్ ఆఫీస్ వార్ సంగతి పక్కన పెడితే, పర్సనల్ గా ఒకరితో ఒకరు బాగానే ఉంటారు. ఈ విషయాన్ని వాళ్ళే స్వయంగా ఎన్నోసార్లు, ఎన్నో వేదికలపై చెప్పారు. కానీ స్టార్ హీరోల అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా కొట్టుకు చస్తున్నారు. ఒక హీరోపై మరో హీరో అభిమానులు బురద జల్లడం, ట్రోలింగ్ చేయడం, తీవ్రమైన కామెంట్స్ తో అవతల హీరోల అభిమానులను రెచ్చగొట్టడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటిదాకా ఇలాంటి ఈ ట్రెండ్ స్టార్ హీరోల విషయంలోనే జరిగింది. కానీ ఇప్పుడు ఈ చెత్త సంస్కృతి మిడ్ రేంజ్ హీరోల అభిమానులకు కూడా సోకింది.
విజయ్ దేవరకొండ వర్సెస్ నాని
సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్లో ఈ వార్ దారుణంగా జరుగుతుంది. నాని (Nani), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అభిమానులు తాజాగా స్టార్ హీరోల అభిమానులను మించి, ఈ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియా వార్ మొదలు పెట్టారు. తీవ్రమైన పదజాలంతో ఒక హీరోపై మరో హీరో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరు స్టార్స్ అభిమానుల మధ్య శత్రుత్వం ప్రస్తుతానికి, పెద్ద స్టార్ హీరోల అభిమానుల వార్ అంత ఎఫెక్టివ్ గా లేకపోయినా, అదే రేంజ్ కు పెరగడానికి పెద్దగా టైం పట్టదు.
అభిమానం పేరుతో వారు ఒకరినొకరు తిట్టుకుంటున్న తీరు ఆందోళనకరంగా మారింది. ఒకవైపు నాని , మరోవైపు విజయ్ దేవరకొండ ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరూ ఎంత ఎదిగినా, లేదంటే భవిష్యత్తులో తమ సినిమాలతో ఎంత పాపులారిటీ సంపాదించుకున్నా ఎవరికి వారే సాటి అవుతారు. అంతేతప్ప ఒకరికి ఒకరు పోటీ మాత్రం అవ్వలేరు. ఎందుకంటే ఇద్దరి యాక్టింగ్ స్టైల్ డిఫరెంట్. కానీ ఈ విషయాన్ని మరిచి, దారుణంగా నాని, విజయ్ దేవరకొండ అభిమానులు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నప్పటికీ ఒకే ఒక హిట్టు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఇద్దరు స్టార్స్ ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్నారు. ఎలాంటి కారణం లేకుండానే ‘కింగ్డం’, ‘హిట్ 3’ టీజర్లు రిలీజ్ అయ్యాక మొదలైన ఈ వార్, సినిమాలు రిలీజ్ అయ్యేలోపు తారా స్థాయికి చేరే అవకాశం ఉంది. నిజానికి ఇదంతా ఓ యూట్యూబర్ రేపిన రచ్చ. విజయ్ దేవరకొండపై పని గట్టుకొని మరో హీరో పీఆర్ టీం చేత నెగెటివ్ కామెంట్స్ చేయిస్తున్నాడని, తొక్కేయాలని చూస్తున్నాడనేది ఫ్యాన్ వార్ కు దారితీసింది.
గతంలోనూ ఇదే పరిస్థితి
గతంలో స్టార్ హీరోల అభిమానులు ఇలాగే సోషల్ మీడియా వేదికగా కొట్టుకు చచ్చేవారు. ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ వర్సెస్ మహేష్ బాబు, రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్, ప్రభాస్ వర్సెస్ బన్నీ ఇలా ఉండేది వార్. ఇప్పుడు ఈ లిస్టులో నాని – విజయ్ దేవరకొండ అభిమానులు కూడా చేరిపోయారు. మరి ఈ సోషల్ మీడియా వార్ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.