RCB on Sale: ఆర్సిబి ఇటీవలే ఐపిఎల్ ట్రోఫీని గెలిచిన సంగతి తెలిసిందే. ట్రోఫీ గెలిచిన సంబరాలు జరుపుకుంటున్న సమయంలో ఆర్సిబి జట్టుకు షాక్ తగిలింది. ఆర్సిబి యాజమాన్యం ఫ్రాంచైజీని పూర్తిగా లేక కొంతమేర షేర్ ను అమ్మడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆర్సిబి విలువ ప్రస్తుతం రెండు బిలియన్ డాలర్లు (రూ. 16 వేల కోట్లు) ఉంటుందని బ్లూమ్ బెర్గ్ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ బ్రిటిష్ డిస్టిలర్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ల మాతృసంస్థ అయిన డియా జియో పిఎల్సీ వద్ద కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Also Read:Rohit’s Lamborghini: రోహిత్ శర్మకు అవమానం…గిఫ్ట్ గా ఇచ్చిన కారును అమ్ముకున్న ఫ్యాన్ June 9,2
కాగా, ఆర్సీబి జట్టు 18 ఏళ్ల అనంతరం ట్రోఫీని గెలిచిన సంగతి తెలిసిందే. ఆర్సిబి జట్టు కప్పును కొట్టాలని చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూశారు. దీంతో ఆర్సిబి జట్టు 2025 సంవత్సరంలో కప్పు గెలిచింది. ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ ర్యాలీ కార్యక్రమంలో ఘోరమైన సంఘటన జరిగింది. ర్యాలీ అనంతరం ఆర్సిబి జట్టు ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
దీంతో ఆటగాళ్లను చూడడానికి అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి వచ్చారు. పోలీసులు వారిని ఆపే సమయంలో లాటి చార్జి చేయగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 11మంది మరణించారు. 33 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. అందులో 10 మంది ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు కర్ణాటక ప్రభుత్వం 10 లక్షల పరిహారాన్ని అందిస్తామని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మరో రెండు రోజులకు 10 లక్షల పరిహారాన్ని 25 లక్షలకు పెంచారు. అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల పరిహారాన్ని అందజేస్తోంది. మరోవైపు మోడీ ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు రెండు లక్షల పరిహారాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50 వేల పరిహారాన్ని అందిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Luckiest Batter: అదృష్టమంటే ఇదే…వికెట్లను తాకినా నాటౌటే.. అది కూడా 98 పరుగుల వద్ద
18 సంవత్సరాల తర్వాత ఛాంపియన్ గా బెంగుళూరు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ( Indian Premier League 2025 tournament ) 18 సంవత్సరాల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టును ఆరు పరుగుల తేడాతో దారుణంగా ఓడించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ నేపథ్యంలోనే మొట్ట మొదటిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలిచింది. కాగా ఈ పరేడ్ లో 11 మంది మరణించిన తర్వాత కోహ్లీ (Virat Kohli) అనుష్క శర్మ ( Anushka Sharma) ఇద్దరూ లండన్ పారిపోయారు. ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. ఈ సంఘటనపై ఇంతవరకు స్పందించడం లేదు. కోహ్లీ కేవలం ఒకే ఒక్క పోస్ట్ పెట్టి సైలెంట్ అయిపోయారు.
🚨 RCB ON SALE 🚨
RCB owner Diageo Plc is exploring options for a potential sale of IPL team Royal Challengers Bengaluru, valued at up to $2 billion 🤑
~ What's your take on this 🤔 pic.twitter.com/InOT9cApBw
— Richard Kettleborough (@RichKettle07) June 10, 2025