Pattudala Movie Review and Rating : తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, త్రిష కాంబినేషన్లో ‘గ్యాంబ్లర్’ ‘ఎంతవాడవు గాని’ వంటి సినిమాలు వచ్చి ఇంప్రెస్ చేశాయి. మూడో సినిమాగా ‘పట్టుదల’ రూపొందింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వీరు గతంలో కలిసి చేసిన సినిమాల మాదిరి ఉందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
అర్జున్(అజిత్) కాయల్(త్రిష) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కొన్నాళ్ల పాటు వీళ్ళు హ్యాపీగా జీవిస్తారు. అయితే కాయల్ కి మిస్ క్యారేజ్(అబార్షన్) అవుతుంది. దీంతో ఆమె మానసికంగా కృంగిపోతుంది. ఈ క్రమంలో భర్త సపోర్ట్ ఎక్కువగా కోరుకుంటుంది. కానీ అర్జున్ పని ఒత్తిడిలో కాయల్ ని సరిగ్గా పట్టించుకోడు. దీంతో అర్జున్ కి విడాకులు ఇచ్చేయాలని కాయల్ డిసైడ్ అవుతుంది. అందుకోసం వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకున్నట్టు ఓపెన్ అయిపోతుంది. విడాకులు మంజూరు అయ్యే వరకు తన తల్లిదండ్రుల వద్ద ఉంటాను అని చెబుతుంది. దీంతో ఆమెను స్వయంగా తన కార్లో తీసుకెళ్లి.. వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించాలని అర్జున్ డిసైడ్ అవుతాడు. అయితే ఈ ప్రయాణంలో వీరిని ఓ గ్యాంగ్ ట్రాప్ చేస్తుంది. కాయల్ ని ఆ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అర్జున్ ను చంపాలని చూస్తుంది ఆ గ్యాంగ్. మరి వారి భారి నుండి అర్జున్ తన భార్యని కాపాడుకున్నాడా? మధ్యలో దీపిక(రెజీనా), రక్షిత్(అర్జున్) ..ల పాత్రలు ఏంటి? వంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా
విశ్లేషణ :
1997 లో వచ్చిన బ్రేక్ డౌన్ అనే హాలీవుడ్ సినిమా స్పూర్తితో ‘పట్టుదల’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు మజిల్ తిరుమేని. సాధారణంగా రీమేక్ అన్నప్పుడు నేటివిటీకి తగ్గట్టు మార్పులు అవి చేసుకుంటే.. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కానీ ఇక్కడ దర్శకుడు చేసింది ఏమీ లేదు.. ‘కాపీ పేస్ట్’ తప్ప అనే అవగాహన మనకి రావడానికి ఎక్కువ టైం పట్టదు. సినిమా మొదటి 15 నిమిషాలు చాలా బోరింగ్ గా సాగుతుంది. హీరోయిన్ కిడ్నాప్ అయ్యేవరకు.. ఆడియన్స్ సహనానికి చాలా పరీక్ష పెట్టాడు దర్శకుడు. అలా అని అక్కడి నుండి కథనం వేగం పుంజుకుంటుంది అని కాదు. ఆడియన్స్ కి ఒక అటెన్షన్ వస్తుంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఇంటర్వెల్ వద్ద ఒక ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్ పై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు. ఇక సెకండాఫ్ మొదలైన కాసేపటికే ఆడియన్స్ ని ఎంత ఫూల్ చేస్తున్నాడో ఒక్కో సీన్ కి రివీల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ కథని సాగదీస్తూ వస్తాడు. బ్యాంక్ సీన్ తర్వాత కార్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ మళ్ళీ అందరినీ అటెన్షన్ అయ్యేలా చేస్తుంది. ఆ ఫైట్ ని చాలా బాగా కంపోజ్ చేశారు. సినిమాటోగ్రాఫర్ ని కూడా ఆ సీక్వెన్స్ కి మెచ్చుకోవలసిందే. మళ్ళీ క్లైమాక్స్ కి దర్శకుడు చేతులెత్తేశాడు. టెక్నికల్ టీం ఈ సినిమాకి చాలా కష్టపడి పనిచేశారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అనిరుధ్ ఈసారి వెస్ట్రన్ స్టైల్లో నేపధ్య సంగీతం వాయించాడు. అది బాగానే సెట్ అయ్యింది. నిర్మాణ విలువలు ఈ కథకి ఇంతకు మించి అవసరం లేదులే అనిపిస్తాయి.
నటీనటుల విషయానికి వస్తే.. అజిత్ నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంది. తన పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా స్టార్టింగ్లో అజిత్ 3 రకాల షేడ్స్ లో కనిపిస్తాడు. ఆ లుక్స్ అన్నీ బాగుంటాయి.కానీ ఇలాంటి కథకి అజిత్ రేంజ్ స్టార్ అవసరం లేదు. అతని కంటే తక్కువ ఇమేజ్ ఉన్న హీరో చేసుంటే సరిపోయేది. యాక్షన్ ఎపిసోడ్స్ లో మాత్రం అజిత్ అదరగొట్టాడు. ముఖ్యంగా కార్లో చేసే ఫైట్లో ఒరిజినల్ గా చేస్తున్నాడేమో అనే ఫీలింగ్ కలిగించాడు. ఇక హీరోయిన్ త్రిష లుక్స్ మాత్రం ఇప్పటికీ ఇంప్రెసివ్ గానే ఉన్నాయి. కానీ ఆమె పాత్ర ఎక్కువగా ఫస్ట్ హాఫ్ కే పరిమితమవ్వడం డిజప్పాయింట్ చేస్తుంది. వాస్తవానికి అజిత్, త్రిష..ల కంటే కూడా అర్జున్, రెజీనా పాత్రలు లేకుండా ఈ సినిమానే లేదు అని చెప్పాలి. వాళ్ళ వరకు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. మిగతా తారాగణం అంతగా గుర్తుండదు
ప్లస్ పాయింట్స్ :
ఇంటర్వెల్ బ్లాక్
సెకండాఫ్ లో వచ్చే కార్ ఫైట్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ :
విపరీతమైన సాగదీత
డైరెక్షన్
క్లైమాక్స్
మొత్తంగా ‘పట్టుదల’ లో ఒకటి రెండు యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి.. కానీ ఎమోషనల్ కనెక్ట్ పూర్తిగా మిస్ అయ్యింది. అందువల్ల ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షగా ఉంటుంది.
Pattudala Movie Rating : 2/5