Action Thriller Movie In OTT : ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని యాక్షన్ సినిమాలు కూడా ఉన్నాయి. థియేటర్లలో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటిలో హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఓ డిజాస్టర్ మూవీ తొమ్మిది నెలల తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ తోపాటు డ్యాన్సర్ ప్రభుదేవా నటించిన కరటక దమనక మూవీ.. ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. కానీ బాక్సాఫీస్ వద్ద మొదటి షోకే బోల్తా కొట్టింది. ఈ మూవీ ఇన్ని నెలలు ఓటీటీలోకి వచ్చేసింది.. మరి ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్లో స్ట్రీమింగ్ కు వచ్చిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఈ యాక్షన్ మూవీ కరటక దమనక ఈ ఏడాది మార్చి 8న థియేటర్ల లో రిలీజైంది. కొన్ని రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఇప్పుడు సుమారు 9 నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో లో తెలుగుతోపాటు హిందీ, తమిళం మొత్తం మూడు భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇది ఓ యాక్షన్ డ్రామా. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.2.8 కోట్లు మాత్రమే రాబట్టగా.. ఐఎండీబీలోనూ కేవలం 5 లోపు రేటింగ్ మాత్రమే వచ్చింది. అయితే కన్నడ యాక్షన్ మూవీస్ ఇష్టపడే తెలుగు వారి కోసం ఇప్పుడీ సినిమా తెలుగులోనూ రావడంతో కాస్త మంచి రెస్పాన్స్ ను వస్తుందని తెలుస్తుంది.
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఇద్దరు మోసగాళ్ల చుట్టూ తిరిగే కథ. కర్ణాటక లోని నందికోలు అనే గ్రామం కరువు కాటకాలతో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఆ సమయంలో ఆ గ్రామాని కి చెందిన ఓ వ్యక్తిని తిరిగి తీసుకురావడం కోసం ఈ ఇద్దరూ అక్కడ అడుగుపెడతారు. అక్కడ కరువు సమస్యను తీర్చడానికి ఒక వ్యక్తిని తీసుకొచ్చేందుకు వాళ్ళు చెరో దారి వెతుక్కుంటారు. అయితే ఇద్దరు ఆ సమస్యను పరిష్కారించారా లేదా అన్నది సినిమా స్టోరీ. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు. దాంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పుడీ మూవీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ రావడంతో ఓటీటీలో అన్న మంచి రెస్పాన్స్ ను అందుకుంటుందేమో చూడాలి.. ఈ మూవీని యోగరాజ్ భట్ డైరెక్ట్ చేశాడు. శివ రాజ్ కుమార్ తో పాటు ప్రభుదేవా, ప్రియా ఆనంద్, నిశ్వికా నాయుడులాంటి వాళ్లు ప్రత్యేక పాత్రల్లో నటించారు.
ఇక ప్రభుదేవా హీరోగా వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ పోతున్నాడు.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోలేక పోతున్నాయి. హీరోగానే కాదు డ్యాన్సర్ గా ప్రొడ్యూసర్ గా పలు సినిమాలకు పనిచేస్తున్నాడు. అటు శివరాజ్ కుమార్ కూడా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.. తెలుగు సినిమాల్లో కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.