Pushpa 2 movie In AP : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప 2. ఇదివరకే విడుదలైన పుష్ప సినిమా భారీ హిట్ అయింది. ఆ సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమా రాజమౌళి రికార్డ్స్ ను క్రాస్ చేస్తుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు. అలానే ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా టికెట్ రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పాలి. వాస్తవానికి ముంబై వంటి రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ రేట్లు ఏకంగా 3000 వరకు ఉన్నాయి. హైదరాబాద్లో 1200 రూపాయలకు పైగా ఈ సినిమా టికెట్ రేట్లు ఉన్నాయి. ఇకపోతే సినిమా రిలీజ్ కి కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్న తరుణంలో ఏపీలో పుష్ప సినిమా విడుదలవుతుందా లేదా అని కొత్త అనుమానాలు కూడా మొదలవుతున్నాయి.
ఇప్పటివరకు జీవో విడుదల కాలేదు. ఈ సినిమాకి సంబంధించి మూవీ టీం ఎంత అడిగితే అంత ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ కూడా చెప్పినట్లు రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. రీసెంట్ గానే నిర్మాత బన్నీ వాసు, అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ ని కలిసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే పుష్ప సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. స్వతహాగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సగటు పవన్ కళ్యాణ్ అభిమాని కళ్యాణ్ నుంచి ఏం కోరుకుంటాడో వాటన్నిటిని తన సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు హరీష్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ నిర్మాతలకు అనుకూలంగా కూడా రేట్లు పెంచుకునే అవకాశం కూడా ఇచ్చినట్లు సమాచారం.
అయితే ఇప్పటివరకు పుష్ప సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేటు ఫిక్స్ కాలేదు. చాలామంది ఈ సినిమా టికెట్స్ ను అనఫీషియల్ గా అమ్మే ప్లాన్ లో ఉన్నారు అని తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో చాలా చోట్ల ఈ సినిమాకి సంబంధించిన టికెట్స్ ఓపెన్ చేశారు. కానీ ఆంధ్రాలో మాత్రం ఈ సినిమా గురించి ఎటువంటి క్లారిటీ లేదు. చాలామందికి సినిమా రిలీజ్ అవుతుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ సినిమాకి సంబంధించి రేపు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది.
Also Read : Tollywood Movies : భారీ హైప్‌తో వచ్చి డిజాస్టరైన సినిమాలు.. పుష్ప 2 పరిస్థితి ఏంటి..?