Movies Releases This Week :
జపాన్
వరుస విజయాలతో దూసుకెళ్తున్న కార్తీ నటించిన తాజా చిత్రం ‘జపాన్’. యాక్షన్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్‌ని బట్టి చెప్పొచ్చు. రాజు మురుగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఎస్‌ఆర్ ప్రభు నిర్మించారు. జపాన్ సినిమా నవంబర్ 10న విడుదల కానుంది.
జిగర్ తాండా డబుల్ ఎక్స్:
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ‘జిగర తాండా’ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి ‘జిగర్ తాండా డబుల్ ఎక్స్’ సీక్వెల్. జిగర తాండాను మించిన వినోదం డబుల్ ఎక్స్‌లో ఉంటుంది. లారెన్స్, సూర్య పాత్రలు రెండూ పోటాపోటీగా ఉంటాయన్నారు దర్శకుడు. ఈ సినిమా నవంబర్ 10న విడుదల కానుంది.
ఎర్రచీర
రాజేంద్ర ప్రసాద్ మనవరాలు, మహానటి ఫేమ్ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎర్రచీర’. సుమన్ దర్శకత్వం వహించగా.. ఎన్‌వీవీ సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. బేబీ డమరి సమర్పకులు. హారర్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా నేడే ప్రేక్షకుల ముందుకు రానుంది.