BigTV English

Anasuya : రేవంత్ రెడ్డి కామెంట్స్.. అనసూయ ట్వీట్ వైరల్..

Anasuya : రేవంత్ రెడ్డి కామెంట్స్.. అనసూయ ట్వీట్ వైరల్..

Anasuya : అనసూయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. యాంకర్ గా, సినీ నటిగా ఎంతో పాపులారిటీ సంపాదించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు ట్రోలింగ్ కు గురైంది. అయినా సరే భయపడలేదు. తనపై విమర్శలు చేసే వారికి ఘాటుగానే బదులిచ్చింది. ఇలాంటి ఘటనలు ఇన్నో ఉన్నాయి. తన ఫ్యామిలీ టూర్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన సమయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ ఫోటోలపై నెగిటివ్ కామెంట్లు చేసిన వారికి అంతే స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చింది. ఇప్పుడు అనసూయ ఓ పొలిటికల్ లీడర్ గతంలో మాట్లాడిన వీడియోను తన పోస్టుకు లింక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.


ఇంతకీ అనసూయ లింక్ చేసిన వీడియోలో ఉన్న నేత ఎవరో కాదు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన గతంలో కొన్ని మీడియా ఛానళ్లపై ఘాటుగా మాట్లాడారు. ఈ వీడియోనే ఇప్పుడు అనసూయ తన పోస్టుకు లింకు చేయడం చర్చనీయాంశంగా మారింది.

గతంలో రేవంత్ రెడ్డి ఏమ్మన్నారంటే..” ఛానళ్లు ఉన్నాయని అడ్డగోలుగా వార్తలు ఇస్తే.. చూసుకుంటూ ఊరుకుంటాం అనుకుంటున్నారేమో.. పండబెట్టి తొక్కి పేగులు తీస్తా. మైకు తీసుకొచ్చి ఎవరి మూతి కిందో పెడితో వాడు కూతలు కూస్తే వాటికి వివరణ ఇచ్చే ఓపిక, తీరిక తనకు లేదు. అట్లాంటి వాళ్లకు తాను సమాధానం చెప్పను” అని గతంలో రేవంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. “మూడ్ సమ్ టైమ్స్ ” అంటూ అనసూయ క్యాప్షన్ జోడించి ఈ వీడియోను ఇప్పుడు ట్విట్టర్ లో తన పోస్టుకు లింకు చేసింది. దానికి లాఫింగ్ ఎమోజీ కూడా జత చేసింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


అనసూయ పోస్టుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఇలా మీడియాకు ఇండైరెక్టుగా కౌంటర్ ఇచ్చిందని కొందరు నెటిజన్లు అంటున్నారు. హైదరాబాద్ లో ఉన్న యాంకర్లులో చాలా మంది బీఆర్ఎస్ కే మద్దతుగా ఉన్నారని వారు చేస్తున్న వీడియోలు, పోస్టులను బట్టి అర్థమవుతోంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి పేరు పలకడానికి కూడా వారు భయపడుతున్నారని.. కానీ అనసూయ డిఫరెంట్ అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఆమె రేవంత్ కు మద్దతుగానే ఈ వీడియో పెట్టారని అంటున్నారు.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×