BigTV English
Advertisement

Nithiin Thammudu : తమ్ముడుపై బడ్జెట్ భారం.. వేణు శ్రీరామ్ ఎంత పని చేశావయ్యా..?

Nithiin Thammudu : తమ్ముడుపై బడ్జెట్ భారం.. వేణు శ్రీరామ్ ఎంత పని చేశావయ్యా..?

Nithiin Thammudu : వరుస ఫెయిల్యూర్స్ అందుకుంటున్నాడు హీరో నితిన్. ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్న రాబిన్ హుడ్ కూడా బాక్సాఫీస్ దగ్గర పర్ఫార్మ్ చేయలేకపోయింది. ఇప్పుడు ఆయన హోప్స్ అన్నీ కూడా తమ్ముడు మూవీపైనే. ఈ తమ్ముడు మూవీకి అనుకున్న బడ్జెట్ కంటే… ఎక్కువ అయిందట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనుకున్న దాని కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.


హీరో నితిన్ సక్సెస్ రుచి చూసి చాలా రోజులు అవుతుంది. 5 ఏళ్ల క్రితం వచ్చిన భీష్మ మూవీ తర్వాత నితిన్‌కు మళ్లీ హిట్ దొరకలేదు. భీష్మ కు ముందు… నితిన్ కు హిట్ అంటే.. మళ్లీ 4 ఏళ్లు వెనక్కి వెళ్లి చూస్తే అ..ఆ మూవీనే. అంటే ఈ పదేళ్లలో నితిన్ కు ఉన్న హిట్స్ కేవలం 2 మాత్రమే. ఇటీవల వచ్చిన రాబిన్ హుడ్ మూవీ పక్కా హిట్ అని అనుకున్నారు. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.

పెరుగుతున్న బడ్జెట్..?


ఇప్పుడు ఉన్న హోప్ తమ్ముడు. అయితే ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే భారీగా పెరుగుతుందట. డైరెక్టర్ వేణు శ్రీరామ్ కథను ప్రొడ్యూసర్ దిల్ రాజుకు చెప్పిన టైంలో… కొంత బడ్జెట్‌ను కోట్ చేశారట. అయితే ఇప్పుడు అది దాటి పోయిందని.. అనుకున్న దాని కంటే కొంత శాతం ఎక్కువ ఖర్చు అయిందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

వైజాగ్ ఫైట్ @10 డేస్…

బడ్జెట్ పెరిగిపోవడానికి ఓ ఎగ్జాంపుల్‌గా ఓ సందర్భం చెబుతున్నారు. ఈ సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. ఆ ఎపిసోడ్ ను వైజాగ్ లో చిత్రీకరించారట. ఆ ఒక్క ఫైట్ సీన్ ను షూట్ చేయడానికి డైరెక్టర వేణు శ్రీ రామ్ దాదాపు 10 రోజుల టైం తీసుకున్నాడట. ఆ 10 రోజులు నటీనటుల ఖర్చులు.. లోకేషన్, హోటల్, ఫుడ్ ఇలా.. అన్ని కలుపుకుంటే… ప్రొడ్యూసర్ దిల్ రాజుకు చాలా ఎక్కువే భారం అయినట్టు సమాచారం.

ఇలాంటివి చాలా సందర్భాల్లో జరిగినట్టు తెలుస్తుంది. దీంతో… దిల్ రాజు కేటాంయిచిన బడ్జెట్ కంటే.. కొంత శాతం పెరిగిందనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఈ మధ్య అనౌన్స్ చేశారు. డైరెక్టర్ వేణు శ్రీ రామ్ బర్త్ డే సందర్భంగా ఈ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. జూలై 4వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పారు. కాగా, ఈ మూవీ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×