Amala Akkineni: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తవుతుంది. ఎన్నో సినిమాలలో నటించి సూపర్ హిట్ సక్సెస్ ను సమంత అందుకుంది. తన మొదటి సినిమా ఏం మాయ చేసావే తో ఇండస్ట్రీని మాయ చేసింది. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత నాగచైతన్యతో పెళ్లి, విడాకులు అందరికీ తెలిసిన విషయమే.. కొద్ది రోజుల కిందట హెల్త్ ఇష్యూస్ తో బాధపడిన సమంత మళ్ళీ తన కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ఇటీవల శుభం మూవీతో నిర్మాతగా పరిచయమై ఇండస్ట్రీలో తనకంటూ మరో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమంతను ఓ ప్రత్యేకమైన అవార్డుతో, జీ తెలుగు సత్కరించింది. సమంత 15 ఏళ్ల సినీ కెరీర్ ని పూర్తి చేసిన సందర్భంగా ఆమెకు జీ తెలుగు అప్సర అవార్డుతో సత్కరించింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా అక్కినేని అమల విచ్చేశారు. ఆ వివరాలు చూద్దాం..
చై-సామ్ విడాకుల తర్వాత..
సమంత నాగచైతన్య జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏం మాయ చేసావే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ చిత్రం 2010లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి 15 సంవత్సరాలు పూర్తవుతుంది. సమంత తన సినీ కెరీర్ ని స్టార్ చేసి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసిన సందర్భంగా జీ తెలుగు అప్సర అవార్డ్స్ 2025 పేరుతో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో సమంతకు అవార్డు అందించారు. ఈ అవార్డు ఫంక్షన్ కు అమల, రోజా, డైరెక్టర్ సుకుమార్, రమ్యకృష్ణ, జయసుధ, అనిల్ రావిపూడి తదితరులు విచ్చేశారు. తాజాగా అప్సర అవార్డ్స్ ప్రోమో ను విడుదల చేశారు. ఆ ప్రోమోలో అనిల్ రావిపూడి చేతుల మీదగా సమంత స్టేజ్ పై అప్సర అవార్డును అందుకుంది. ఇదే ప్రోమోలో సమంత తెలుగు ఇండస్ట్రీ నాకు అన్ని ఇచ్చింది. నా తొలి ప్రాధాన్యత తెలుగు ప్రేక్షకులే.. తెలుగు ఇండస్ట్రీనే అని, మీ అందరి ముందు నేను ప్రామిస్ చేస్తున్న అంటూ సమంత మాట్లాడిన మాటలకు అక్కడే ఉన్న అక్కినేని అమల నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఈ ప్రోమోలో ఇదే హైలెట్ సీన్. అక్కినేని అమల, సమంతను గౌరవిస్తుంటే ఆమె ఆనందించడం, అలాగే ఆమె మాట్లాడిన మాటలకు చప్పట్లు కొట్టడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చైతన్య ,సమంత విడిపోయిన తరువాత ఇంత కాలానికి అమల,సమంత ఒకే స్టేజ్ పై కనపడటం ఫాన్స్ కు ఆనందాన్ని ఇస్తుంది. ఈ వీడియో చూసిన అక్కినేని ఫ్యాన్స్, సూపర్ అంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
అత్తా ..కోడలు కు ఒకే వేదిక పై అవార్డు ..
అప్సర అవార్డ్స్ లో అక్కినేని అమలకు అవార్డును అందించారు. ఎన్నో ఏళ్లుగా జంతువుల సంరక్షణను బ్లూ క్రాస్ సంస్థ ను బాధ్యతగా నిర్వహిస్తున్న అక్కినేని అమలకు అప్సర అవార్డును అందించారు. రోజా, చేతుల మీదుగా ఈ అవార్డును అమలు అందుకుంది. తాజాగా ఈ ప్రోమో ను జి సంస్థ విడుదల చేసింది. ప్రోమోలో అమల మాట్లాడుతూ.. జంతువులను సంరక్షించడం నా ఒక్క దాని బాధ్యత గాక ఇది ఒక టీం గా ముందుకు వెళ్లడం వల్లే సాధ్యమైంది అంటూ ఆమె తెలిపారు. అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఫోటోలను చూపించి వి ముగ్గురిలో లేజీ ఎవరు అని రోజా అనగా, అమల నేనే అని తెలిపింది. ముగ్గురిలో హ్యాండ్సమ్ ఎవరు అని రోజా అడగ్గా.. అమలా హలో గురు ప్రేమకోసమే అనే నాగార్జున పాటకు డాన్స్ చేస్తుంది. ఇక్కడితో ప్రోమో ముగుస్తుంది. ఒకే స్టేజిపై అత్తా కోడలు ఇద్దరు అవార్డును తీసుకోవడం అక్కినేని ఫ్యాన్స్ కు పండుగ గా గోచరిస్తుంది.