Crime News: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ప్రతాప్ గఢ్‌లో నలుగురు బాలికలు నదిలో నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు.
ప్రతాప్ గఢ్, జలాల్ పూర్ దివా గ్రామానికి చెందిన నలుగురు బాలికలు బంక మట్టి కోసం నది లోపలికి దిగారు. అయితే నది లోతు అంచనా తెలియక నీటమునిగి మృతిచెందారు. మృతిచెందిన వారిని స్వాతి(13), సంధ్య (11), చాందిని (7), ప్రియాన్షి (7) గా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Road Accident: కాళేశ్వరం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌లోనే మృతి.. మరో ఏడుగురు?
ALSO READ: APMSRB Jobs: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు, జీతం రూ.1,10,000