Nithiin: నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తమ్ముడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ హీరోగా, కన్నడ నటి సప్తమి గౌడ, వర్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మూవీ టీం అనౌన్స్ చేసింది. ఈ రోజు శ్రీరామ్ వేణు పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫన్నీ వీడియో రూపంలో మూవీ టీం విడుదల చేసింది.
తమ్ముడు వచ్చేది అప్పుడే ..
ఈ సినిమా డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు రిలీజ్ డేట్ ను ప్రకటించారు. శ్రీరామ్ వేణు పుట్టినరోజు సందర్భంగా, మూవీ టీం ఒక ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో వేణుని అందరూ విష్ చేయడానికి వస్తారు. తమ్ముడు మూవీ ఎప్పుడు అని అందరూ వచ్చి డైరెక్టర్ని అడుగుతారు. మొదట హీరోయిన్ వచ్చి అడుగుతుంది. ఆ తర్వాత రెండవ హీరోయిన్ వర్ష మూవీ అప్డేట్స్ చెప్పమని అడుగుతుంది. ఇక లయ నేను తెలుగు హీరోయిన్ ని ఎన్నో రోజులుగా రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఈ మూవీ గురించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి. నేను శ్రీ సినిమాలో ఉన్నానా లేదా అని అడుగుతుంది. కనీసం రిలీజ్ డేట్ అయిన చెప్పండి ప్లీజ్ అని అడుగుతుంది. మీరు సినిమా రిలీజ్ డేట్ అడగడానికే వచ్చారా అని డైరెక్టర్ అడుగుతాడు. అవును ఇంక దేనికోసం వచ్చారు అనుకుంటున్నారు అని లయ అంటుంది. ఇలా అందరూ వచ్చి ఆయనని పుట్టినరోజు విషెస్ చెప్పకుండా సినిమా అప్డేట్ గురించి అడగడం చాలా ఫన్నీగా ఉంటుంది. కట్ చేస్తే .. డైరెక్టర్ దిల్ రాజ్ రూమ్ కి వెళ్ళగానే అక్కడ తమ్ముడు రిలీజ్ డేట్ జులై 4 అని ప్రకటించడంతోపాటు కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో తో తమ్ముడు సినిమాని జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ఫ్యాన్స్ కి నిర్మాత ఒక క్లారిటీ ఇచ్చారు. తమ్ముడు సినిమా వరల్డ్ వైజ్ గా జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ తమ్ముడు హిట్…మరి ఈ తమ్ముడు ..
ఈ సంవత్సరం రాబిన్హుడ్ అంటూ నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు. ఇప్పుడు నితిన్ ఆశలన్నీ రాబోతున్న తమ్ముడు మీదే ఉన్నాయి. శ్రీరామ్ వేణు గతం లో పవన్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ మూవీని చేసి సక్సెస్ ని అందుకున్నారు. ఇప్పుడు నితిన్ తో తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 1999లో పవన్ కళ్యాణ్ సినిమా ‘తమ్ముడు’ బ్లాక్ బాస్టర్ ని అందుకుంది. ఇప్పుడు అదే పేరుతో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో సప్తమి గౌడ, వర్షా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినియర్ నటి లయ, బలగం సంజయ్ కృష్ణ కిషోర్ రాజు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన మూవీ పోస్టర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.