India Pak War: కశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత నెలలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈక్రమంలోనే రష్యాలోని పాకిస్థాన్ రాయబారి ముహమ్మద్ ఖలీద్ జమాలి మన దేశానికి బహిరంగంగానే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ భారత్, పాకిస్థాన్ పై దాడికి దిగితే.. అణ్వాయుధాలతో సహా తమ వద్ద ఉన్న పూర్తిస్థాయి శక్తిని ప్రయోగించాల్సి వస్తోందని ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బహిరంగంగానే మాట్లాడారు. భారత్ పై పాక్ అణుబాంబులతో దాడికి సిద్ధంగా ఉందని జమాలి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల వేళ పాక్ రాయబారి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
130 అణుబాంబులు ఉన్నాయి..
మన దేశంపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి హింసకు పాల్పడటమే కాకుండా ఇప్పుడు అణ్వాయుధాలతో దాడి చేస్తామంటూ పాకిస్థాన్ బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఇటీవల వారం రోజుల క్రితం పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి కూడా భారతదేశంపై వేయడానికి పాకిస్థాన్ వద్ద 130 అణుబాంబులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రష్యాలోని పాకిస్థాన్ రాయబారి మహమ్మద్ ఖాలిద్ జమాలి కూడా ఇలానే బహిరంగ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ పై భారత్ దాడిచేస్తే చూస్తూ ఊరుకోమని, అణ్వాయుధాలతో ప్రతిదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
అణుబాంబులతో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం..
రష్యా రాజధాని నగరం అయిన మాస్కోలో అక్కడి మీడియాతో పాకిస్థాన్ రాయబారి ముహమ్మద్ ఖాలిద్ జమాలీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పాకిస్థాన్ గడ్డపై భారత్ సైనిక దాడులు చేయాలని వ్యుహాలు రచిస్తోందని.. తమకు విశ్వసనీయ నిఘావర్గాల సమాచారం ఉందని ఆయన అన్నారు. పాకిస్థాన్ లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేసేందుకు భారత్ నిర్ణయించిందని అతను చెప్పారు. వీలైనంత త్వరలోనే ఈ దాడులు జరిగే అవకాశం ఉందని జమాలీ పేర్కొన్నారు. ఒకవేళ ఇదే జరిగితే భారత్ పై అణుబాంబులతో దాడి చేయడానికి సిద్దంగా ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్‌కు భయం..
రష్యాలోని పాక్ రాయబారి జమాలీ మాటలను బట్టి భారత్ ఏ సమయంలోనైనా దాడిచేయొచ్చనే భయంతో పాకిస్థాన్ క్లియర్ కట్ గా అర్థం అవుతోంది. అందుకే ముందుగానే అణ్వాయుధాలు ఉన్నాయని చెబుతూ.. భారత్ ను భయపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. కానీ భారత ప్రభుత్వం దీనిపై చాలా క్లారిటీగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పహల్గాం ఉగ్రదాడికి కారణమైన పాక్ ను వదిలిపెట్టేదే లేదని చెబుతోంది.
❗️NUCLEAR warning from Pakistan to India
Diplomat says Islamabad could use NUKES in case of war with New Delhi
‘Pakistan will use full spectrum of power, BOTH conventional and nuclear’ — ambassador to Russia tells RT https://t.co/iTQWdWRQlZ pic.twitter.com/LcQXKbIjD0
— RT (@RT_com) May 3, 2025
ఆ భయంతోనే.. ఇలా..?
ఇప్పటికే దాయాది దేశానికి.. సింధు జలాలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న భారత్.. పూర్తిగా వాణిజ్య సంబంధాలను కూడా కట్ చేసింది. ఆ దేశ విమానాలకు భారతదేశ గగనతలంలో ప్రవేశించేందుకు వీలు లేదు. ఇలా ఇప్పటికే పాకిస్థాన్ ను దెబ్బతీసేందుకు చాలా రకాల చర్యలు తీసుకున్న భారత్ ప్రత్యక్ష దాడికి కూడా దిగుతుందని ప్రచారం కూడా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. ఈ సమయంలోనే పాక్ నాయకులు, అధికారులు భయంతో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
సింధు నది జలాల పంపిణీ కోసం రెండు దేశాల మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960లో ఓ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సింధు జలాల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్థాన్‌లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేయడంతో యుద్ధ చర్యగా జమాలీ వివరించారు. నది జలాలను స్వాధీనం చేసుకోవడానికి (లేదా) ఆపడానికి (లేదా) మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నం అయినా పాకిస్థాన్‌పై యుద్ధ చర్యగానే పరిగణిస్తామని చెప్పారు. ఇలాంటి చర్యలను తిప్పికొట్టేందుకు పూర్తి స్థాయి శక్తితో ప్రతిస్పందిస్తామని జమాలీ భారత్‌కు హెచ్చరికలు పంపారు.
అయితే, అణ్వాయుధాల గురించి చర్చల వేళ పాకిస్థాన్ సైన్యం నిన్న ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణిని పరీక్షించింది. ఈ ఆయుధం 450 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. సంప్రదాయ, అణు పేలోడ్‌లను సైతం మోసుకెళ్లగలదని.. పాకిస్థానీ సైన్యం ఈ క్షిపణి పరీక్ష గురించి నిన్న బయటకు వెల్లడించింది.