Yamadonga Re Release: ఖర్చు పెట్టి పరువు తీసుకోవడం అంటే ఇదేనేమో.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు… యమదొంగ పరిస్థితి ఇప్పుడు సరిగ్గా ఇలాగే ఉంది. టాలీవుడ్ లో గత కొంతకాలంగా రీ రిలీజ్ ట్రెండ్ బలంగా నడుస్తోంది. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించాయి. పోకిరి, జల్సా, ఒక్కడు లాంటి చిత్రాలు రీ రిలీజ్ లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టి, సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ విజయగాథలు చూసి, పాత సినిమాలను మళ్లీ విడుదల చేయడానికి పంపిణీదారులు, నిర్మాతలు ఉత్సాహం చూపించారు.
యమదొంగ పరిస్థితి ఇదే ఇప్పుడు..
ఇప్పుడు అదే ఉత్సాహంతో నందమూరి తారక రామారావు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఎవర్‌గ్రీన్ హిట్ ‘యమదొంగ’ కూడా రీ రిలీజ్ బరిలోకి దిగింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని, మే 18న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ సినిమాను మళ్లీ పెద్ద తెరపై చూసేందుకు ఆసక్తిగా ఉంటారని, పాత రికార్డులను ‘యమదొంగ’ బద్దలు కొడుతుందని చిత్ర యూనిట్ భారీ ఆశలు పెట్టుకుంది. గత రీ రిలీజ్ సినిమాల మాదిరిగానే ‘యమదొంగ’ కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందని భావించింది. కానీ, పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. రీ రిలీజ్ కు ఇంకా కొన్ని రోజులే సమయం ఉన్నప్పటికీ, ‘యమదొంగ’ సినిమాకు కనీస స్థాయిలో కూడా స్పందన లభించడం లేదు. బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటికీ, చాలా చోట్ల టికెట్లు అమ్ముడుపోవడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ అత్యంత నిరాశాజనకంగా ఉన్నాయి. రికార్డులు సృష్టించడం సంగతి అటుంచితే, కనీసం థియేటర్లు నిండే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
అప్పుడు సంచలనం ..మరి ఇప్పుడు ..
ఒకప్పుడు సంచలనం సృష్టించిన, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ‘యమదొంగ’ సినిమాకు రీ రిలీజ్ లో ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా, ఎన్టీఆర్ కెరియర్ లోనే విజయవంతమైన చిత్రం గా నిలిచింది. ఐతే ఇక రీ రిలీజ్ ట్రెండ్ లో ఒక సినిమా విజయం సాధిస్తే, ఆ ట్రెండ్ లో వచ్చే అన్ని సినిమాలూ విజయం సాధించవని ‘యమదొంగ’ నిరూపిస్తోంది. సరైన సమయం, ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలో విఫలమైతే, ఎంత పెద్ద సినిమా అయినా రీ రిలీజ్ లో చతికిలపడాల్సి వస్తుందని ఇది స్పష్టం చేస్తోంది. భారీ అంచనాలు పెట్టుకొని, ఖర్చు పెట్టి రీ రిలీజ్ చేస్తే, కనీస స్పందన కూడా లేకపోవడం నిజంగా పరువు తీసుకోవడమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా, ఇతర సినిమాలు రీ రిలీజ్ లో విజయాలు సాధించాయి కదా అని ఆశిస్తే ఇలాంటి పరాభవం తప్పదని ‘యమదొంగ’ రీ రిలీజ్ పరిస్థితి తెలియజేస్తోంది. ఈ సినిమా చివరికి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Shanmukh: నా టైమ్ వచ్చింది.. మనల్నెవడ్రా ఆపేది.. దీప్తి కాసుకో.. షన్ను పోస్ట్ వైరల్