BigTV English

NTR and Prashanth Neel: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. పట్టాలెక్కబోతున్న ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్.. ఎప్పట్నుంచంటే?

NTR and Prashanth Neel: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. పట్టాలెక్కబోతున్న ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్.. ఎప్పట్నుంచంటే?

NTR and Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్‌ కోసం సినీ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వీరి కాంబో అనౌన్స్ చేసి ఎంతో కాలం అయింది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గత రెండున్నరేళ్ల క్రితం వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్‌ను చూసిన ప్రేక్షకాభిమానులు ఇప్పటి వరకు స్క్రీన్‌పై మళ్లీ చూడలేదు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ‘దేవర’ సినిమా కూడా అదిగో వస్తుంది. ఇదిగో వస్తుంది అందటూ సమ్మర్ నుంచి సెప్టెంబర్‌కి మార్చారు.


అయితే దేవర నుంచి చిన్న చిన్న అప్డేట్స్ రావడంతో నందమూరి ఫ్యాన్స్‌లో కాస్తో కూస్తో ఆనందం ఉంది. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు తన ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. దేవర మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతుండగానే తన లైనప్‌లో ప్రశాంత్ నీల్‌తో చేయబోయే ‘NTR 31’ షూటింగ్ గురించి తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ పోస్టర్ ఒకటి రిలజ్ అయి అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది.

 Also Read: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్స్.. కారణం తెలిస్తే ఎగిరి గంతేస్తారు


ఇక ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. NTR 31 మూవీ షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరిలో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ లేకుండానే దర్శకుడు ప్రశాంత్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. అది పూర్తి కాగానే ప్రశాంత్ ప్రాజెక్ట్‌లో ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి ఒక పవర్ ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ మాస్ యాక్షన్‌కి తగ్గట్టుగా ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ అద్భుతంగా ఉందని.. తమ అభిమాన హీరో ఎన్టీఆర్‌కు బాగా సెట్ అవుద్దని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న దేవర మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చేస్తున్న మూవీ ఇదే కావడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×