Indian Railways Train Ticket Booking: ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా టికెట్ బుకింగ్ టైమ్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రయాణీకుల సౌకకర్యం కోసం తీసుకొచ్చిన సరికొత్త టికెట్ బుకింగ్ రూల్స్ ను డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై రైల్వే అధికారిక వెబ్ సైట్, యాప్ తో పాటు ప్రైవేట్ టికెట్ బుకింగ్ యాప్స్ ద్వారా రెండు గంటల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
టికెట్ల బుకింగ్ టైమ్ 2 గంటల పాటు పెంపు
రైల్వే సంస్థ టికెట్ల బుకింగ్ టైమింగ్స్ లో కీలక మార్పులు చేసింది. కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన రైల్వే టికెట్ బుకింగ్ రూల్స్ ప్రకారం గతంతో పోల్చితే 2 గంటలు ఎక్కువ సమయం టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿గతంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు టికెట్ బుకింగ్ అవకాశం ఉండేది.
⦿కొత్తగా అమల్లోకి వచ్చిన రూల్స్ ప్రకారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్స్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. తత్కాల్ టికెట్ల బుకింగ్ యాథావిధిగా ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది.
⦿రైలు టికెట్ బుకింగ్ క్యాన్సిలేషన్ ఛార్జీలలో రైల్వే సంస్థ ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు.
⦿IRCTC యాప్ ద్వారా ఫ్లాట్ ఫారమ్ టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఒక్కో టికెట్ పూ రూ. 100 తగ్గింపు
ఇక భారతీయ రైల్వే సంస్థకు చెందిన అధికారిక వెబ్ సైట్ IRCTC ద్వారా, లేదంటే యాప్ ద్వారా చౌక ధరకే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. IRCTC నుంచి ఆన్ లైన్ లో టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు.. ప్రయాణీకులు కన్వీనియన్స్ ఫీజు, ఏజెంట్ సర్వీస్ ఛార్జ్, పేమెంట్ గేట్ వే ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ కంపెనీల యాప్ ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులు కన్వీనియన్స్ ఫీజు, ఏజెంట్ సర్వీస్ ఛార్జ్, పేమెంట్ గేట్ వే ఛార్జీలు చెల్లించాలి. ఎక్కు మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటికీ కొంత మంది ప్రైవేట్ కంపెనీ యాప్స్ ద్వారా రైల్వే టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. వారు IRCTC యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే తక్కువ ధరకే పొందే అవకాశం ఉంటుంది. ఉదాహారణకు ఢిల్లీ నుంచి వారణాసికి థర్డ్ AC టిక్కెట్లను IRCTC ద్వారా బుక్ చేసుకుంటే ఒక్కో దానిపై రూ. రూ. 100 కంటే ఎక్కువ ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఎన్ని వేల రైళ్లు కేటాయించిందంటే?