BigTV English

NTR31 Movie Update : డ్రగ్స్ సామ్రజ్యంలో డ్రాగన్ మూవీ… ఇది ఇంటర్నేషనల్‌ రేంజ్ ప్లాన్ గురూ..!

NTR31 Movie Update : డ్రగ్స్ సామ్రజ్యంలో డ్రాగన్ మూవీ… ఇది ఇంటర్నేషనల్‌ రేంజ్ ప్లాన్ గురూ..!

NTR31 Movie Update :యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమా తర్వాత “మ్యాన్ అఫ్ ది మాసెస్” గా మారిపోయారు. ఒక సినిమాతో ఆయన రేంజ్ గ్లోబల్ స్థాయిలో పాకిపోయింది. ఎన్టీఆర్ , కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో ఆయన బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ పాత్ర ఇందులో చాలా పవర్ఫుల్ గా ఉంటుందని, మొదటి నుంచి చెబుతున్నారు. ఇలా ఏజెంట్ తరహా పాత్ర చేయడం కూడా ఆయనకు తొలిసారి కావడం గమనార్హం.


ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ గుర్తింపు..

మరోవైపు వార్ 2 తర్వాత.. ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)తో సినిమా చేయబోతున్నట్లు గతంలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ఆర్ఆర్ఆర్ కంటే ముందే రావాల్సి ఉంది. కానీ లేట్ అయింది. ఈలోపు ‘దేవర’ కూడా వచ్చేసింది. అయితే లేట్ అయినా సరే లేటెస్ట్ గా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇక ఈ సినిమాలో ‘రుక్మిణీ వసంత్’ హీరోయిన్ గా నటించబోతోంది. ఇప్పటికే ఈమె ‘సప్త సాగరాలు దాటి’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతి తర్వాత నుంచి ప్రారంభం కాబోతోంది అని, మొదటి షెడ్యూల్ లోనే ఎన్టీఆర్ కూడా జాయిన్ కాబోతున్నారని సమాచారం. అంతేకాదు ఫిబ్రవరి చివరి వారం నుంచి జరిగే షెడ్యూల్లో కూడా ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారట.


డ్రగ్స్ నేపథ్యంలో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ..

వాస్తవానికి ఈ ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ సమ్మర్ హాలిడేస్ నుంచి జాయిన్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ డ్రాగన్ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేటప్పుడు ప్రకటించడంతో లేటు చేయకుండా ముందుగానే ఇందులో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. 2026 జనవరి 9వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఈ సినిమా నుంచి నిన్న టీజర్ ని కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఈ సినిమా డ్రగ్స్ నేపథ్యంలో ఉంటుందట. ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లోనే చేస్తున్నట్లు తెలుస్తోంది. థాయిలాండ్ , మయన్మార్, లాయిస్ వంటి ప్రాంతాలలో షూటింగ్ ఉంటుందని సమాచారం. ఈ మూడు దేశాల్లో ఉండే డ్రగ్స్ మాఫియా నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుందని కూడా ఇన్సైడ్ వార్తలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా సరికొత్త జానర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఎన్టీఆర్. మరి ఈ సినిమా ఎన్టీఆర్ కి ఎలాంటి స్టేటస్ అందిస్తుందో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×