NTR31 – Rukmini Vasanth : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో ప్రశాంత నీల్ ఒకరు. ఉగ్రం సినిమాతో కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా మారాడు ప్రశాంత్. ప్రశాంత్ కే జి ఎఫ్ సినిమాతో సౌత్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు. ఎస్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకి సీక్వల్ గా వచ్చిన కే జి ఎఫ్ 2 సినిమా కూడా సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇకపోతే ఇక్కడితో ప్రశాంత్ నీల్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయిందని చెప్పాలి. చాలామంది తెలుగు హీరోలు కూడా ప్రశాంత్ నీల్ వర్క్ చేయాలి అనుకున్నారు. అలా అనుకున్న వారిలో ఎన్టీఆర్ ఒకరు. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత రీసెంట్ గా దేవర సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు తారక్. ఈ సినిమా తారక్ మాత్రమే కాకుండా కొరటాల శివకు కూడా మంచి ప్లస్ అయింది.
దేవర సినిమాకు సీక్వెల్ రానున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. అయితే సీక్వెల్లో కీలక అంశాలు చూపించబోతున్నట్లు కూడా క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇకపోతే ప్రశాంత్ నేను దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాను చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతుంది అని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే కొన్ని ఇంటర్వ్యూలులో వీటిపై రుక్మిణి కూడా స్పందించింది. కానీ ఏ రోజు రుక్మిణి నటిస్తున్నట్లు క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమాలో రుక్మిణి ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టారు చిత్ర యూనిట్. ఈ సినిమా పూర్తయినంతవరకు మరో సినిమా సైన్ చేయకూడదు అని చెప్పారట. ఈ సినిమాలో రుక్మిణి నటించిన బోతున్నట్లు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ప్రభాస్ కి మంచి కం బ్యాక్ సినిమా అయింది. ఇదివరకే రాసిన ఉగ్రం స్టోరీ తో మరోసారి ప్రేక్షకులకు హై ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటించింది. ఈ సినిమాలో శృతిహాసన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఇక ప్రశాంత్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాలో కూడా రుక్మిణి పాత్ర చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తుంది. మామూలుగా ప్రశాంత్ నీల్ సినిమా అంటే భారీ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా అలానే ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించనుంది. సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ త్వరలో రావాల్సి ఉంది.
Also Read : Akhil’s Fiancee Zainab Ravdjee :సచిన్ రికార్డు ను బ్రేక్ చేసే పనిలో అయ్యగారు