BigTV English
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో బన్నీ హీరోయిన్… ఇంక ఎంతమంది ఉన్నారయ్య అనిల్

Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో బన్నీ హీరోయిన్… ఇంక ఎంతమంది ఉన్నారయ్య అనిల్

Chiranjeevi : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కేథరిన్ తెలుగు సినీ రంగంలో చమ్మక్ చల్లో చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇద్దరమ్మాయిలు సినిమాలతో ఆకాంక్ష పాత్రలో నటించిన మెప్పించారు. ఈ అమ్మడు అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సరైన పాత్రలు ఈ హీరోయిన్ కి రాలేదని చెప్పుకోవచ్చు. టాలీవుడ్లో అడపా దడపా సినిమాలు చేస్తున్న కేథరిన్ కు ఓ భారీ ప్రాజెక్టులో ఛాన్స్ పట్టేసింది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె ఏ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందో మనము తెలుసుకుందాం..


మెగాస్టార్ సినిమాలో బన్నీ హీరోయిన్..

మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ రానుంది. సంక్రాంతి వస్తున్నాం తో సక్సెస్ ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవి హీరోగా సినిమా ప్రకటించినప్పటి నుండి అభిమానులలో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో ఇప్పటికే వెంకటేష్ నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నయనతారను ఎంచుకున్నారు. ఇప్పుడు రెండవ హీరోయిన్ గా కేథరిన్ తీసుకున్నట్లు సమాచారం. హీరోతో పాటు ఇద్దరు హీరోయిన్స్ కు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ కావడంతో, కేథరిన్ ను ఎంచుకున్నారు. కేథరిన్ సరైనోడు సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో నటించింది. ఇప్పుడు చిరుతో అల్లు అర్జున్ ఎమ్మెల్యే హీరోయిన్ కేథరిన్ నటిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి 157 వ సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సాహు గార్లపాటి సుస్మిత కొణిదల, ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. షైన్ స్క్రీన్, గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి పాత్రకు శివ శంకర వరప్రసాద్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.


కేథరిన్ మూవీస్..

కేథరిన్ తెలుగులోనే కాక కన్నడంలోనూ మలయాళం, తమిళ్ చిత్రాలలోనూ నటించింది.ఇక 2017 లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో దేవికారాణి పాత్రలో నటించి మెప్పించింది. బింబిసారా, మాచర్ల నియోజకవర్గం చిత్రాలలో నటించి సక్సెస్ ని అందుకుంది. జయ జానకి నాయక లో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించారు. వదలడు, భళా తందనానా,పైసా మూవీస్ లో నటించిన ఈమె  2023 లో వాల్తేరు వీరయ్య సినిమాలో డాక్టర్ నిత్య పాత్రలో ఆమె చిరంజీవి సరసన నటించింది. ఇప్పుడు మరోసారి చిరంజీవితో ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ లో నటించనుంది. ఈ మూవీ లో ఒక హీరోయిన్ గా ఇప్పటికే నయనతార ను సెలక్ట్ చేసారు.ఆమె కూడా చిరు తో రెండు సినిమాలలో నటించింది.ఇద్దరు హీరోయిన్స్ చిరుతో నటించిన వారు కావటం విశేషం. సంక్రాంతి వస్తున్నాను సినిమాతో 300 కోట్ల క్లబ్లో చేరిపోయినా అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీతో మరో సెన్సేషన్ కు రెడీ చేస్తున్నారు. చిరు, అనిల్ కాంబోలో వస్తున్న సినిమా కామెడీ జోనర్ లో రానున్నట్లు సమాచారం. ఇక చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. ఈ మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి పండగలాంటి న్యూస్.. షూటింగ్ కి దొర వచ్చాడురా

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×