OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో OG ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను పెంచేసింది.
రన్ రాజా రన్ సినిమాతో సుజీత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్న సుజీత్ కాన్ఫిడెన్స్ మెచ్చి ప్రభాస్.. సాహూ అవకాశం ఇచ్చాడు. ఇక సాహూ సినిమా ఏ రేంజ్ లో తెరకెక్కించాడో అందరికీ తెల్సిందే. సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా.. ఆ టేకింగ్, కథకు ఫ్యాన్స్ ముగ్దులయ్యారు. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాగా సుజీత్.. OGని మొదలుపెట్టాడు. రీమేక్ సినిమా కాకుండా సొంత కథను పవన్ కు చెప్పి.. ఒప్పించి సక్సెస్ అయ్యాడు.
ఇక పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క రాజకీయం అంటూ తిరుగుతున్న సమయంలోనే సుజీత్.. OGని పట్టాలెక్కించాడు. మిగతాసినిమాలను పక్కన పెట్టి మరీ పవన్.. OG షూటింగ్ ను మొదలుపెట్టి కొంతవరకు షూటింగ్ ను ఫినిష్ చేశాడు. ఈలోపు జనసేన ఎన్నికల్లో గెలవడం, పవన్.. డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టడం జరిగిపోయాయి. ఇక డిప్యూటీ సీఎం అయిన తరువాత పవన్ సినిమాలు ఆపేస్తాడని అనుకున్నారు. కానీ, ఇచ్చిన మాట కోసం పవన్.. సమయం చూసుకొని మరీ తన సినిమాలను ఫినిష్ చేస్తూ వస్తున్నాడు.
ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కు సిద్దమయ్యింది. జూన్ 12 న ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించినా.. అది వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం జూలై 4 న వీరమల్లు రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది ఇంకో రెండు రోజుల్లో తెలియనుంది.
ఇక వీరమల్లు తరువాత OG సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు పవన్. ఇప్పటికే పవన్ లేని సీన్స్ అన్ని షూటింగ్ చేసేశాడు సుజీత్. ఎప్పుడు పవన్ వస్తాడా.. ? మిగిలిన సీన్స్ ఫినిష్ చేద్దామా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు. ఇక ఆ తరుణం వచ్చేసింది. ఈ మధ్యనే ముంబైలో కీలక షెడ్యూల్ ను మొదలుపెట్టిన మేకర్స్ నిన్నటితో దాన్ని పూర్తిచేశారు.
ఇక OG చివరి షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ షెడ్యూల్ కోసం చిత్రబృందం విజయవాడ రానుందని తెలుస్తోంది. రేపటి నుంచి విజయవాడ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ ఫినిష్ కానుంది. ఎట్టకేలకు అనుకున్నట్లుగానే సుజీత్ త్వరగానే షూటింగ్ ను ఫినిష్ చేయనున్నాడు. ఇక ఈ షూటింగ్ ఫినిష్ అయ్యింది అంటే.. మిగతావన్నీ మేకర్స్ చూసుకుంటారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో సుజీత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.