BigTV English

Inimel Promo: శృతి హాసన్‌తో లోకేష్ కనగరాజ్ ఘాటు రొమాన్స్.. ప్రోమో అదిరిపోయింది!

Inimel Promo: శృతి హాసన్‌తో లోకేష్ కనగరాజ్ ఘాటు రొమాన్స్.. ప్రోమో అదిరిపోయింది!
Inimel
Inimel

Lokesh kanagaraj and shruti haasan Starrer Inimel Promo Released: ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు ప్రేక్షకాభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఉంది. కమల్ హాసన్‌తో విక్రమ్, విజయ్‌తో లియో వంటి సినిమాలు తెరకెక్కించి బాక్సాఫీసును షేక్ చేశాడు. ఈ సినిమాలతో తనకు మరింత పాపులారిటీ పెరిగింది. అంతటి పాపులారిటీ ఉన్న దర్శకుడు హీరోగా మారితే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి.


అయితే ఇప్పటికే ఎంతో మంది స్టార్ దర్శకులు హీరోలుగా మారి సూపర్ డూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అదే బాటలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అడుగు వేశాడు. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌తో ఓ ఆల్బమ్ చేశాడు.

‘ఇనిమెల్’ అనే ఈ ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఆల్బమ్ సాంగ్‌లో లోకేష్ కనగరాజ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. ఈ ఆల్బమ్ అందరిలోనూ ఆసక్తిని రేకిత్తిస్తోంది. లోకేష్ నటుడిగా తన మొదటి వీడియోలోనే రొమాన్స్‌తో చెలరేగిపోయాడు.


Also Read: ఈ రోజు టీవీల్లో ప్రసారమయ్యే బ్లాక్ బస్టర్ సినిమాలు.. కొత్త చిత్రాలు కూడా

శృతి హాసన్‌తో లోకేష్ ఘాటు రొమాన్స్ చూసి అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. 18 సెకన్ల నిడివితో విడుదల చేసిన ఈ ప్రోమోలో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్లను నింపేశారు. వీరిద్దరి రొమాన్స్ మాత్రం చాలా మంది దృష్టిని ఆకట్టుకుంది. ఆ వీడియోలో చూస్తే.. థియేటర్లలో స్టార్ట్ అయిన వీరి రొమాన్స్.. ఇంట్లో సోఫా సెట్‌పై ఒకరిపై మరొకరు పడిపోయేంతవరకు సాగింది.

ఇకపోతే ఇన్నాళ్లూ కెమెరా వెనుక యాక్షన్ అని చెప్పిన లోకేష్ ఇప్పుడు కెమెరా ముందుకొచ్చి రొమాంటిక్ సీన్లలో నటించడం చాలా కొత్తగా అనిపించింది. ఈ వీడియో చూసే వాళ్లు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు.

కాగా లోకేష్ కనగరాజ్ గతంలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా.. ఇలా ఫుల్ లెంగ్త్‌లో కనిపించడం.. అదీగాక రొమాంటిక్ బాయ్‌గా నటించడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన పూర్తి సాంగ్‌ను మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

మరి ప్రోమోలోనే ఇంతటి ఘాటైన రొమాన్స్ ఉంటే.. ఇక ఫుల్ సాంగ్‌లో ఇంకెంత రొమాన్స్ ఉంటుందో అని ప్రేక్షకాభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ ఫుల్ సాంగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: జపాన్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న స్టార్ డైరెక్టర్ కొడుకు

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఈ వీడియోను రూపొందించింది. ఈ ఆల్బమ్ సాంగ్‌కి కమల్ హాసన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా ఈ పాటకి లిరిక్స్ కూడా కమల్ హాసనే రాశారు. ఇకపోతే లోకేష్ కనగరాజ్ తన నెక్స్ట్ మూవీని సూపర్ స్టార్ రజనీకాంత్‌తో చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×