Parvathy Thiruvothu.. సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు ఎప్పుడు ఇతరులతో డేటింగ్ మొదలు పెడతారో తెలియదు.. ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో తెలియదు. అయితే బ్రేకప్ చెప్పుకున్న వారు సరైన రీజన్ మాత్రం ఎప్పటికీ చెప్పరనే చెప్పాలి. కానీ ఇక్కడ ఒక బ్యూటీ మాత్రం ఏకంగా విచిత్రమైన కారణం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా తనకు ఆకలి ఎక్కువ అని, ఆ కారణంగానే ఒక మంచి వ్యక్తిని కోల్పోయాను అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి ఆమె ఎవరు? తన ఆకలికి తన బాయ్ ఫ్రెండ్ నుండి తాను దూరం అవడానికి గల కారణం ఏమిటి? అసలు ఆమె ఏం చెప్పాలనుకుంటుంది? ఎవరా వ్యక్తి? అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు సైతం తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
రిలేషన్షిప్ స్టేటస్ పై పార్వతీ ఊహించని కామెంట్స్..
ఆమె ఎవరో కాదు ప్రముఖ బ్యూటీ పార్వతీ తిరువోత్తు (Parvathi Thiruvothu). తన అందాలతో గ్లామర్ ఫోటోలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసిన ఈమె, ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలతో కూడా యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ముక్కుసూటి మనిషిగా పేరు దక్కించుకున్న ఈమె విషయం ఏదైనా సరే తన అభిప్రాయాలను నాన్చకుండా చెప్పేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన రిలేషన్షిప్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే తాను మాట్లాడుతూ అసలు విషయం చెప్పడంతో ఇది కూడా ఒక రీజనేనా ? అని కొంతమంది కామెంట్లు చేయగా.. మరి కొంత మంది నిన్ను భరించాలంటే కష్టమే? అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి పార్వతీ చెప్పిన ఆ విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అతి ఆకలి వల్లే బంధాన్ని కోల్పోయా..
పార్వతి ఆ ఇంటర్వ్యూలో భాగంగా తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ.. “ఒకప్పుడు నేను ఒక వ్యక్తితో డేటింగ్ చేశాన. ఆయన చాలా మంచివారు.ఒక అద్భుతమైన వ్యక్తి కూడా . అయితే నాకు విపరీతమైన కోపం ఉండేది. ముఖ్యంగా నాకు ఆకలి కూడా ఎక్కువే. ఎప్పుడైనా ఆకలి ఎక్కువ అయినప్పుడు ఆ ఆకలికి తట్టుకోలేక చాలా సందర్భాలలో కోప్పడ్డాను.దానివల్లే మా బంధం ఎంతో కాలం కొనసాగలేకపోయింది. అలా మేమిద్దరం విడిపోయాము. అయితే కొంతకాలం తర్వాత అనుకోకుండా నేను ఆయనను కలిశాను. క్షమాపణలు కూడా చెప్పాను. కానీ ఆయనతో బంధం బ్రేకప్, అన్నీ కూడా నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. ఏదైనా బంధంలోకి అడుగు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని నేను మా బంధం బ్రేకప్ అయిన తర్వాతే తెలుసుకున్నాను” అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది పార్వతీ తిరువొత్తు.
ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నాను..
ఇకపోతే రిలేషన్ నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా.. వారితో మంచి సంబంధాలు కలిగి ఉన్నానని తెలిపింది. మూడేళ్ల నుంచి తాను సింగల్ గానే ఉంటున్నట్లు తెలిపిన ఈమె, చిత్ర పరిశ్రమకు చెందిన దర్శక నిర్మాతలు, నటులతోనే కాకుండా టెక్నీషియన్స్ తో కూడా గతంలో తాను రిలేషన్ లో ఉన్నానని తెలిపింది. ఇక అంతేకాదు డేటింగ్ యాప్ కూడా ఉపయోగిస్తున్నానని తెలిపిన ఈమె, సమయం కుదిరినప్పుడు ఆ యాప్ ను చెక్ చేస్తూ ఉంటానని ఒకవేళ ఎవరైనా దొరికితే ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమలో పడితే అది ఎంతో కాలం కొనసాగుతుందని తాను భావిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా పార్వతి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పార్వతీ సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య నటించిన ‘ధూత’ అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె తాజాగా ‘తంగలాన్’ సినిమాతో ఆకట్టుకుంది.