BigTV English
Advertisement

Parvati Nair: ‘అర్జున్ రెడ్డి’ ఆఫర్ రిజెక్ట్ చేసిన బ్యూటీ.. ఇప్పుడు ఫీల్ అయ్యి ఏం లాభం!

Parvati Nair: ‘అర్జున్ రెడ్డి’ ఆఫర్ రిజెక్ట్ చేసిన బ్యూటీ.. ఇప్పుడు ఫీల్ అయ్యి ఏం లాభం!

Parvati Nair: ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) అనే సినిమా గురించి కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు.. సౌత్ ప్రేక్షకులకే కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది. ఏడాదికి ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నా కూడా అందులో కొన్ని మాత్రమే ల్యాండ్‌మార్క్‌గా నిలిచి పోతాయి. అలా తెలుగు సినీ పరిశ్రమను, తెలుగు ప్రేక్షకులను బాగా ఇంపాక్ట్ చేసిన సినిమా అంటే ‘అర్జున్ రెడ్డి’ అని చాలామంది ఆడియన్స్ ఒప్పుకుంటారు కూడా. అలాంటి సినిమాను చాలామంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు. వారంతా ఈ మూవీని ఎందుకు మిస్ చేసుకున్నామా అని ఇప్పుడు ఫీలవుతున్నారు. అందుకే ఒకరు పార్వతి నాయర్ (Parvati Nair).


చిన్న పాత్రలకే పరిమితం

కోలీవుడ్‌లో నటిగా పలు సినిమాల్లో మెరిసింది పార్వతి నాయర్. అజిత్ హీరోగా నటించిన ‘ఎన్నై ఆరిందాళ్’, విజయ్ హీరోగా నటించిన ‘ది గోట్’ సినిమాల్లో నటించి మంచిగా గుర్తింపు సాధించింది. అంతే కాకుండా మాలీవుడ్‌లో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘ఐకాన్’లో కూడా ఒక కీలక పాత్రలో కనిపించింది. ఇలా చాలావరకు ఈ నటి కెరీర్ అంతా చిన్న చిన్న పాత్రలు పోషించడంతోనే సరిపోయింది. అలాంటి సమయంలోనే తెలుగులో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయిన ఒక సినిమాలో తనకు ఛాన్స్ వచ్చినా అది మిస్ చేసుకున్నానని చాలా ఫీలయ్యింది. ఆ సినిమా మరేదో కాదు.. ‘అర్జున్ రెడ్డి’. ఈ విషయాన్ని ఒక సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో పార్వతి నాయర్ స్వయంగా బయటపెట్టింది.


Also Read: ఏంటి ఆ నిర్మాత దగ్గర సమంత అప్పు చేసిందా..?

దేనికైనా రాసిపెట్టుండాలి

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో జరిగిన ఇంటరాక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ గురించి పార్వతి నాయర్‌ను ఫ్యాన్స్ అడిగారు. ‘‘ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయని అర్జున్ రెడ్డిని రిజెక్ట్ చేసి ఇప్పుడు ఫీల్ అవుతున్నారంట నిజమేనా?’’ అని తనకు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘అవును. అది నిజమే. అది చాలా మంచి సినిమా నేను మిస్ చేయకుండా ఉండాల్సింది. కానీ మనదే అని రాసిపెట్టుంటే ఎప్పటికైనా మన దగ్గరికే చేరుతుందని నేను నమ్ముతాను. అలాగే నాకు అని రాసిపెట్టున్న ఎన్నో మంచి సినిమాలు నా దగ్గరకు వస్తాయని నమ్ముతున్నాను’’ అని చెప్పుకొచ్చింది పార్వతి నాయర్. దీంతో ఈ బ్యూటీ మిస్ చేసుకున్న ఛాన్స్ గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

సందీప్‌ను నమ్మలేదు

చాలాకాలం క్రితమే ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయనే రిజెక్ట్ చేశానని బయటపెట్టిన పార్వతి.. ఆ మూవీపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘నేను స్క్రిప్ట్ చదివినప్పుడు నాకు సింపుల్‌గా, మామూలుగా అనిపించింది. కానీ ఒక డెబ్యూ డైరెక్టర్‌కు ఇంత టాలెంట్ ఉంటుంది అనే విషయాన్ని నేను అంచనా వేయలేకపోయాను. అందుకే ఆ పాత్రకు ఓకే చెప్పలేదు. కానీ నేను ఆ సినిమాను థియేటర్‌లో చూసినప్పుడు అది మిస్ చేసుకోవడం నా దురదృష్టం అనిపించింది. ఒక మామూలు లవ్ స్టోరీని అలా మార్చినందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకే ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి’’ అని ప్రశంసించింది పార్వతి నాయర్.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×