BigTV English

Akkineni Nagarjuna: ఇది నా కొడుకు పెళ్లి వేడుక మాత్రమే కాదు.. ఎమోషనల్ అయిన నాగ్

Akkineni Nagarjuna: ఇది నా కొడుకు పెళ్లి వేడుక మాత్రమే కాదు.. ఎమోషనల్ అయిన నాగ్

Akkineni Nagarjuna: అక్కినేని నాగచైతన్య- శోభిత దూళిపాళ్ల వివాహం గత రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందదే. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు ప్రత్యేకంగా వేసిన పెళ్లి మండపంలో చై, శోభితా మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇక  ఈ వివాహ వేడుకకు ఇండస్ట్రీ నుంచి అతిరథ మహారధులు హాజరయ్యారు. చిరంజీవి, సుహాసిని మణిరత్నం, నాని, కార్తీ, దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఈ  పెళ్లి వేడుకలో సందడి చేశారు.


ఇక చైతన్య.. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు. రెండేళ్లు డేటింగ్ లో  ఉన్న ఈ జంట ఇరుకుటుంబ వర్గాల అంగీకారంతో నిన్నపెళ్లితో ఒకటయ్యిం.ది ఇక కొత్తజంటను సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆశీర్వదించారు. కొడుకు పెళ్లి ఘనంగా జరగడంతో అక్కినేని నాగార్జున సంతోషం వ్యక్తం చేశాడు.

Fahadh Faasil: పుష్ప వలన నాకు వచ్చింది లేదు.. పోయింది లేదు..


తాజాగా నాగార్జున మీడియాకు ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపాడు. చైతన్య- శోభితా పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ.. కొడుకు పెళ్లికి సహకరించిన మీడియాకు ధన్యవాదాలు తెలిపాడు.”నా హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగుతోంది. మీడియా సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మమ్మల్ని అర్థం చేసుకొని మా ఈ అందమైన క్షణాన్ని మేము మరింత మధురంగా జరుపుకోవడానికి మాకు స్పేస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

మీ ఆలోచనలు మరియు మాపై మీరు చూపించిన గౌరవం మీరు తెలిపిన శుభాకాంక్షలు మా ఆనందాన్ని మరింత పెంచాయి.మా ప్రియమైన స్నేహితులు కుటుంబ సభ్యులు మరియు అభిమానులకు మీ ప్రేమ మరియు ఆశీర్వాదాలు నిజంగా ఈ సందర్భాన్ని మరువలేనివిగా చేశాయి.

Samantha: ఏంటి ఆ నిర్మాత దగ్గర సమంత అప్పు చేసిందా..?

నా కొడుకు పెళ్లి కేవలం కుటుంబ వేడుక మాత్రమే కాదు.. మీరు అందరూ మాతో పంచుకున్న ప్రేమ, అభిమానం మద్దతు కారణంగానే ఇది ఒక ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకంగా మారింది. మీరు మాపై కురిపించిన లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు అక్కినేని కుటుంబం హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది” అంటూ రాసుకు వచ్చాడు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి

నిజం చెప్పాలంటే.. నాగ్ మొదటి నుంచి తన ఇద్దరు  కొడుకుల భవిష్యత్ గురించి ఎంతో మదనపడుతూ వచ్చాడు. ఇక ఈ పెళ్లితో నాగ్ కు కొంత ఉపశమనం దక్కిందనే చెప్పాలి.  ఈ ఏడాది అక్కినేని కుటుంబంలో జరిగిన వివాదాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ చేసిన  అనుచిత వ్యాఖ్యలు.. నాగ్ కుటుంబాన్ని రోడ్డున పడేశాయి. చై- సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని, కేటీఆర్ వద్దకు సమంతను పంపడానికి నాగ్ ప్రయత్నించాడని, అది నచ్చక సామ్ విడాకులు తీసుకుందని  మాట్లాడారు.

ఐఎండీబీ ర్యాంకింగ్స్.. ఈ ఏడాది టాప్ 10 లో నిలిచిన స్టార్స్ వీరే

ఇక  ఈ వివాదంపై నాగార్జున చాలా సీరియస్ అయ్యాడు. అక్కినేని కుటుంబంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక తప్పు తెలుసుకున్న మంత్రి సురేఖ  వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా  కూడా .. తమ పరువుకు భంగం కలిగించిన సురేఖపై అక్కినేని కుటుంబం లీగల్ గా కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు లో నడుస్తోంది. త్వరలోనే ఈ కేసుపై వకోర్టు తీర్పును ఇవ్వనుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×